గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుంది

GHMC Election Campaign : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అటు టీఆర్‌ఎస్‌…ఇటు బీజేపీ గెలుపే టార్గెట్‌గా ఫైనల్‌ పంచ్‌లకు సిద్ధమయ్యాయి. మంగళవారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగుస్తుంది.

గతంతో పోలిస్తే నోటిఫికేషన్‌ నుంచి పోలింగ్‌ వరకు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థుల కంటే ఎక్కువగా పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మాటల తూటాలు పేలాయి.

టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలిపాయి. పట్టు నిలుపుకునే దిశగా కొన్ని పార్టీలు.. పూర్వ వైభవం కోసం మరి కొన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఎంఐఎం గతం కంటే ఎక్కువ సీట్లే తమ లక్ష్యం అని చెబుతోంది.

నేడు, రేపు నగరంలో ప్రముఖ నాయకుల ప్రచారాలున్నాయి. ప్రచారానికి శని, ఆదివారాలు కీలకం కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.