ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: విస్తృతంగా ఓటరు నమోదు ప్రక్రియ ఎంపీపీ కారం విజయకుమారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం లో త్వరలో జరగబోయేటువంటి ఖమ్మం,వరంగల్,నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు రేపటితో ముగుస్తుండడంతో గురువారం ఎంపీపీ కారం విజయకుమారి విస్తృతంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.అందులో భాగంగా పూర్తి చేసిన ఫామ్-18 పత్రాలను జడ్పీటీసీ పొశం నర్సింహారావు కు అందజేసిన ఎంపీపీ కారం విజయకుమారి.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, కూనవరం సర్పంచ్, మరియు సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక ప్రసాద్,సర్పంచ్ రామకృష్ణ,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు,యూత్ అధ్యక్షులు రుద్ర వెంకట్,టీఆర్ఎస్ నాయకులు తంత్రపల్లి కృష్ణ, వెంకటసోములు,తదితరులు పాల్గొన్నారు.