అబ్బుగూడెం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
అబ్బుగూడెం గ్రామంలో ఈ రోజు ఉచిత పశువైద్య శిబిరాన్ని అన్నపురెడ్డిపల్లి మండల జడ్.పి.టి.సీ-భారత.లావణ్య, మరియు ఎం.పి.పీ-సున్నం.లలిత,అబ్బుగూడెం గ్రామ సర్పంచి కూరం.ప్రమీల కలిసి ప్రారంభించారు.ఈ పశువైద్య శిభిరం లో మండల పశువైద్య అధికారి డా.టీ.రాజేందర్ గర్బకోశ,జీర్ణ సంబంధ,శ్వాససంబంధిత జబ్బులతో బాధ పడుతున్నా పశువులను పరీక్షించి చికిత్స చేశారు.దూడలకు నట్టల మందు పంపిణీ చేయడం జరిగింది.ఈ వైద్య శిభిరం లో పశు వైద్య సిబ్బంది k.గంగాభవాని,ప్రసాద్,వెంకటేశ్వర్లు,శ్రావణ్ తదితరులు మరియు రైతులు పాల్గొన్నారు.