ఆపదలో ఉన్న మహిళకు రక్తదానం చేసిన శ్రామిక శక్తి యూనియన్ అధ్యక్షుడు సానికొమ్ము.శంకర్ రెడ్డి

భద్రాచలంలో ఓ ప్రవైట్ వైద్యశాలలో తూరుబాక గ్రామానికి చెందిన పిట్టా.మున్నీ(23) అనే మహిళకు అత్యవసరంగా రక్తం అవసరమైంది..విషయం తెలుసుకున్న ఐటీసీ-శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము.శంకర్ రెడ్డి ఆపదలో ఉన్న ఆ మహిళకు రక్తదానం చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు.గత నెలలో కూడా తీత్ల.దేవి అనే మహిళకు కూడా ఆపరేషన్ కి రక్తం అవసరం తెలిసి ఆమెకు కూడా రక్తదానం చేయడం జరిగింది.ఇప్పటి వరకు 17 సార్లు రక్తం ఇచ్చి శంకర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.. అలాగే కార్మికుల సంక్షేమం గురించే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ..పలువురికి ఆదర్శంగా నిలిచారు.రక్తదానం చేస్తూ..పలువురికి ప్రాణాదానం చేస్తున్న శంకర్ రెడ్డి ని పలువురు కొనియాడారు.