వితంతు మహిళలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వాలి -ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు వినతి
వివక్ష,అసమానతల మధ్య
బతుకెళ్లదీస్తున్న వితంతు,ఒంటరి మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతను కల్పించాలని వితంతు, ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం నిర్వాహకులు సంద బాబు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు బుధవారం వినతిపత్రం అందించారు.గ్రామాల్లో వితంతు, ఒంటరి మహిళల కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయని, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వీరి కుటుంబాలకు సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపించి వితంతు,ఒంటరి మహిళల కుటుంబాలను ఆదుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవనోపాదుల మెరుగుదల కోసం ముందుకు వచ్చిన వితంతు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం తరఫున అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గతాన్ని తలచుకుని కుంగిపోకుండా జీవనోపాదులను మెరుగుపరుచుకుని పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.వినతిపత్రం అందించిన వారిలో సీనియర్ జర్నలిస్టు,పోపా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రపు శ్రీధర్ లు ఉన్నారు.