చరిత్ర సృష్టించిన బైడెన్

డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎవరూ సాధించని రికార్డును చేరుకుని చరిత్ర సృష్టించారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) వరకు నమోదైన పోలింగ్ ప్రకారం.. జో బైడెన్‌కు మొత్తం 6.99 కోట్ల ఓట్లు పోలయ్యాయి. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థి కూడా ఇన్ని ఓట్లను గెలుపొందలేదు. 2008 అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా అత్యధికంగా 6.96 కోట్ల ఓట్లను గెలుపొందగా.. జో బైడెన్ ఒబామా రికార్డును తాజాగా అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పారు. మరోపక్క ట్రంప్‌ ఇప్పటివరకు 6.68 కోట్ల ఓట్లను గెలుచుకున్నారు. జో బైడెన్‌ మ్యాజిక్ ఫిగర్ 270కు చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఖాతాలో 227 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ట్రంప్ ఇప్పటివరకు 213 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. నెవాడా, అరిజోనా, అలాస్కా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్‌వేనియా, నార్త్ కరోలినా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
….