పవన్ కల్యాణ్.. శ్రీముఖి అసలు విషయం అదేనా?

లాక్‌డౌన్ కారణంగా సుమారు ఏడు నెలల పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నవంబర్ 1 నుంచి మళ్లీ ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు వినిపించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా శ్రీముఖి వకీల్ సాబ్ గెటప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌తో ఓ సెల్పీ దిగింది. ఆ ఫోటోలను వెంటనే శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా శ్రీముఖి ఈ సమయంలో రాయడానికి మాటలు రావడం లేదంటూ.. ‘లవ్ పవన్ కళ్యాణ్’ అని ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్‌లో ఉన్నారు. మరో వైపు ఈ పోస్ట్ చేస్తుంటే.. ఈ సినిమాలో శ్రీముఖి ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా అని అప్పుడే సినీప్రేక్షకుల్లో చర్చ నడుస్తుంది.