ఆదివాసీ చట్టాల మీద అవగాహన సదస్సు

బుధవారం అశ్వారావుపేట మండలం తిమ్మాపురం గ్రామంలో ఆదివాసీ చట్టాల మీద అవగాహన సదస్సు లో పాల్గొని అవగాహన కల్పిస్తున్న హైకోర్టు న్యాయవాది కణితి లక్ష్మణరావు,
ఆదివాసీ సేన భద్రాద్రి జిల్లా కన్వీనర్ ఊకె రవి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అమాయక ఆదివాసీల మీద గిరిజనేతరులు దాడులు ఎక్కువవుతున్నట్టు సేన దృష్టికి వచ్చిందని ,పోలీసులు,ప్రభుత్వ అధికారులు గిరిజనేతరుల పక్షాన కొమ్ము కాస్తూ ఆదివాసీల మీద తప్పుడు కేసులు నమోదు చేస్తే ఎవర్ని ఆదివాసీ సేన వదిలిపెట్టదని చట్టo ప్రకారం బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు.ప్రభుత్వ అధికారులు కూడా చట్టం ప్రకారం పనిచేయాలని లేని యెడల చట్టం రుచి ఏంటో చూపెడతామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఆదివాసీ సేన మండల అధ్యక్షులు వగ్గేల రామకృష్ణ,కూరం చిలకరావు గ్రామస్తులు,బేతి రమేష్ యువత,మహిళలు తదితరులు పాల్గొన్నారు
అవగాహన అనంతరం ఆదివాసీ సేన గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.