ఉపాధి హామీ పనుల గుర్తింపు -గ్రామ సభలో పాల్గొన్న డిపి ఓ ఎంపీడీఓ ఎంపిఓ

మంగపేట మండలంలోని దోమెడ గ్రామంలో బుధవారం రోజు గ్రామ సభ నిర్వహించారు.ఇట్టి గ్రామ సభకు ములుగు జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ వెంకయ్య ఎంపీడీఓ ఇక్బాల్ హుస్సేన్ ఎంపీఓ హాజరయ్యారు.సభలో ఉపాధి హామీ పథకంలో పనులనులతో పాటు వివిధ అభివృద్ధి పనులు వ్యవసాయ పంట పొలాలకు వెళ్ళడానికి రోడ్లను గుర్తించి తీర్మానం చేశారు.అనంతరం పల్లె ప్రకృతి వనం వద్దకు వెళ్లి పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు.ఈ సభలో టి ఏ సురేష్, కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.