Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రామపంచాయతీల హరితహారం నర్సరీల పనులు ప్రారంభం.

చండ్రుగొండ & అన్నపురెడ్డిపల్లి:చండ్రుగొండ మండలంలోని పోకలగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం లోని మర్రిగూడెం గ్రామ పంచాయతీ లలో హరితహారం నర్సరీ లో 2020-21 సంవత్సరమునకు సంబంధించిన నర్సరీ పనులను ప్రారంభించారు. చండ్రుగొండ అటవీ శాఖ రేంజ్ అధికారి సి.హెచ్.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని నర్సరీలో మొక్కల పెంపుదల, పాలిధీన్ బ్యాగుల్లో మట్టి,ఎరువులు ఏ నిష్పత్తుల్లో నింపాలి, ప్రైమరీ బెడ్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి.అనే అంశాల మీద మెలుకువలు తగు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్లాంటేషన్ టి.ఎ-ఎస్.నాగమణి, పోకలగూడెం గ్రామ పంచాయతీ సెక్రెటరీ- జి.శైలజ, మర్రిగూడెం గ్రామ పంచాయతీ సెక్రెటరీ- డి.బాలాజీ, చండ్రుగొండ ఏ.పీ.వో-ప్రమీల, అన్నపురెడ్డిపల్లి ఏ.పీ.ఓ-వెంకటేశ్వరరావు, చండ్రుగొండ ఎం.పీ.వో-తులసీరామ్, పోకలగూడెం ఫారెస్ట్ సెక్షన్ అధికారి-టి.రామారావు, వన సేవకులు, తదితరులు పాల్గొన్నారు.