అభివృద్ధి పేరుతో ఆదివాసీలను అనిసివేత.

వాజేడు మండల కేంద్రంలో అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కోశాధికారి చిరంజీవి. మాట్లాడుతూ
కొన్ని శతాబ్దల కాలం పాటు ఆదివాసి జీవన విధానం అటవీలో అటవి ప్రాంతానికి దగ్గరలో ఆదివాసి తెగలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి ఆదివాసీల అస్తిత్వం సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి ఆదివాసి ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తరుణంలోనే ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటూ1/70 చట్టం, పెస చట్టo,LTR చట్టవ్యతిరేకమైన జీవోలు ప్రభుత్వం తీసుకొస్తూ ఈ యొక్క చట్టాలను ఉల్లంఘన చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న పాలక ప్రభుత్వాలపై ఆదివాసి సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అలాగే అమాయకపు ఆదివాసిలపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి అని ఆయన మండిపడ్డారు . మండల అధ్యక్షులు ఎట్టి రాజబాబు మండల ప్రధాన కార్యదర్శి గొంది కామేశ్వరరావు మట్టి రమేష్ చిట్టి బాబు అర్జున్ వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు