అంచనాలు తారుమారు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే తప్పక గెలవాల్సిన కీలక పీఠం ‘ఫ్లోరిడా’. ఇక్కడ మొదటి నుండి సర్వేలన్నీ జో బైడెన్ కు అనుకూలంగా ఉన్నాయి. ఆ అంచనాలన్నీ తారుమారు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ముందంజలో దూసుకెళ్తున్నారు. కీలక రాష్ట్రమైన ట్రంప్ ముందంజలో ఉండడంతో ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫ్లోరిడాలో ఇప్పటివరకు జో బైడెన్ 47.8 శాతం (52,60,207) ఓట్లు సాధించగా… ట్రంప్ 51.2 శాతం (56,46,198) ఓట్లు దక్కించుకుని ముందంజలో ఉన్నారు.