దహనసంస్కారాలకు ఉపసర్పంచ్ బుస్సి శ్రీను ఆర్ధిక వితరణ
మండల పరిధిలో ని తోగ్గూడెం పంచాయతీ గోపాలరావుపేట గ్రామానికి చెందిన పురిటి సత్యం( 70)గత నాలుగురోజులుగా జ్వరం రావడంతో తీవ్ర అనారోగ్యంతో బుదవారం మృతిచెందారు.నిరుపేదకుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఉపసర్పంచ్ బుస్సి శ్రీనివాస్ రావు దహనసంస్కారాలకు తనవంతు సహాయంగా 1000 రూపాయలు మృతిని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ సభ్యులు సూర నరసింహారావు, గంగరబోయిన రామకృష్ణ, కన్నె రమేష్, అబ్బు శ్రీను, రేసు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.