నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ పట్టివేత

ప్రభుత్వం నిషేధించిన ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ పట్టుకున్న పోలీసులు. Si శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మంగపేట గంపోని గూడెం క్రాస్ రోడ్ లో మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో AP07TG1089నెంబర్ గల లారీ మణుగూరు నుండి ఏటూరునాగారం వైపు వెళ్తుండగా అట్టి లారీని తనిఖీ చేయగా అందులో అనుమానాస్పదమైన చేపలు కనిపించడంతో వెంటనే SI శ్రీనివాస్ మత్స్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అవి ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ప్రభుత్వం నిషేధం విధించిన చేపలు కావడంతో మత్స్య శాఖ అధికారి భూక్య కృష్ణ పిర్యాదు మేరకు అట్టి లారీ డ్రైవర్ మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.