నా భర్తను నాకు అప్పగించండి… అత్తమామల ఇంటి ఎదుట భార్య ఆందోళన

బూర్గంపాడు మండలం, సారపాక ముత్యాలమ్మపేట లో మంగళవారం రాత్రి ఒక వివాహిత తన భర్త కోసం అత్తగారి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళితే భద్రాచలం పట్టణానికి చెందిన హర్షిత సారపాక చెందిన శివరామకృష్ణ ప్రేమించుకుని కుటుంబ సభ్యుల మధ్య 2018 మార్చి 11న వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ కొన్ని రోజుల్లో గా మనస్పర్ధలు రావడంతో శివరామకృష్ణ భార్య, మూడేళ్ల కుమారుని విడిచి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో భార్య హర్షిత నా భర్తను నాకు అప్పగించాలంటూ అత్తగారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.