Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దుబాయ్ లో గల్ఫ్ కార్మికులను కలిసిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

వేములవాడ, మే 19,(నిజం చెపుతాం)గత శాసనసభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు నా గెలుపులో కీలకపాత్ర పోషించిన గల్ఫ్ బిడ్డలకు కృతజ్ఞత తెలపాలని దుబాయ్ వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. దుబాయ్ లోని అల్కుస్ ప్రాతం లో డ్యూటీ లో ఉండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన భీమారం మండలం మోత్కురావుపేట్ గ్రామానికీ చెందిన గణేష్_భూమల్ల (25) కంపనీ కి వెళ్లి క్యాంప్ బాస్ విజయ్ గారిని కలిసి గణేష్ అకాల మరణ కారణాలను అడిగి తెలుసుకున్నారు.సదరు మృతుడి రూమ్ కి వెళ్ళి అతని బెడ్ చూసి బాధతో కలత చెందారు.అనంతరం క్యాంప్ బాస్ విజయ్ ని తీసుకొని సదరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ త్వరగా ఇప్పించాలని అధికారులను కోరారు.ఈ కేసును ఫాలో అప్ చేస్తున్న జి డబ్ల్యు ఏ సి యూఏఈ ఉపాధ్యక్షుడు మల్లేష్ కోరేపు ను విజయ్ మరియు కంపనీ హెచ్ ఆర్ టీమ్ తో యధావిధిగా కమ్యూనికేషన్ చేసి త్వరగా బాడీ పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు.దుబాయ్ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వయంగా పరిస్థితి తెలుసుకొని, బాడీ త్వరగా ఇంటికి వస్తుంది మీరు అధైర్య పడవద్దు అని గణేష్ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో జి డబ్ల్యు ఏ సి యూఏఈ అధ్యక్షులు రవి కటుకం, రుద్రంగి మండల అధ్యక్షుడు బొల్లి కుమార్, మరియు మోతె బాబు, నరేష్ బుక, గగన్ ఆకుల, రాజు తదితరులు ఉన్నారు.