Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరణంలో వీడని భార్యాభర్తల బంధం … ఇద్దరికి తీవ్ర గాయాలు

 

… ఇద్దరికి తీవ్ర గాయాలు

కారులో వ్యాపించిన మంటలు.. ఫైర్ ఇంజన్ సహాయంతో ఆర్పివేత

బోనకల్ : మే 15, (నిజం చెపుతాo)

మండలంలోని ముష్టికుంట్ల గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ వృత్తిరీత్యా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పలు చోట్ల పనిచేసి మధిరలో స్థిరపడ్డాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్న సూర్యనారాయణ దంపతులు ఖమ్మంలో నివాసముంటున్న పెద్ద కుమారుడు ఇంటికి బయలుదేరారు. మధిర నుంచి కారులో మనవడు అనిల్ నాయనమ్మ, తాతయ్యతో పాటు కేర్ టేకర్ నాగరాజు తో కలిసి ఖమ్మం బయలుదేరారు. ఈ క్రమంలో ముష్టికుంట్ల గ్రామం సమీపంలో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులు కొత్తూరు సూర్యనారాయణ (92), రుక్మిణీ (85) లు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్, నాగరాజు తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కుపోగా,108 సిబ్బంది , వెంకట్రావు ,సమీపంలో ఉన్నవారు అతి కష్టం మీద బయటకు లాగారు. మృతదేహాలను పొలంలో ఉంచి, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో పెట్రోల్ పైపు పగలటంతో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలు విస్తృతంగా పొలాల పక్కన చెట్లకు అంటుకోవడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పోలీసుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి వేశారు. మధిర సీఐ మధు, బోనకల్ ఎస్సై మధుబాబు లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.