Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి.

మహేశ్వరం మే 13 నిజం, న్యూస్ ప్రతినిధి: చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపుకై రాత్రింబవళ్లు అహర్నిశలు కృషిచేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటితో పార్లమెంటు ఎన్నికలు ముగిసినందున ప్రతి ఒక్క కార్యకర్త అదే రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన సూచించారు.