Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల, మే 13 (నిజం న్యూస్) :
చేవెళ్ల మండలంలోని తమ స్వగ్రామమైన కౌకుంట్లలో మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన తనయులు కార్తీక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి కోడళ్లు స్రవంతి, లక్ష్మీ, కుటుంబ సభ్యుడైన డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డిలతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధి వద్ద వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక అని, ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు వున్నదని, ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరమని తెలిపారు. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుందని తెలిపారు.