Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తండ్రి ఆశయాల అనుగుణంగాముందుకు పోతున్న.. తనయుడు..ఆర్కే

చర్ల ఏప్రిల్ 14 ( నిజం న్యూస్) తండ్రి దేవ భక్తిని సాంబశివరావు (లేటు) ఆశయాలతో తనయుడు దేవ భక్తుని రామకృష్ణ (ఆర్కే) ముందుకు పోవడం అభినందనీయమని పలువురు వ్యక్తులు కొనియాడారు తండ్రి జ్ఞాపకార్థం రెండవ వర్ధంతి సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని వారపు సంతలో సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఆకలి తీర్చేందుకు మీకోసం మేమున్నాం టీం చైర్మన్ నీలి ప్రకాష్ సభ్యులకు వితరణగా సుమారు రూ7.500 ఖర్చుతో అన్న సంతర్పణ కు వితరణంగా అందజేశారు.

అంతేకాకుండా వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు పై చదువుల కొరకు స్థానిక గ్రంథాలయంలో చదువుకునేందు వచ్చే విద్యార్థులకు పాఠకులను.దృష్టిలో పెట్టుకొని సుమారు.రూ10.000 పదివేల విలువగల కూలర్లను వితరణగా ఆదివారం అందజేశారు కాంగ్రెస్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ చేతుల మీదుగా కూలర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా పలువు తండ్రి ఆశయాల అనుగుణంగా ముందుకు. పోతూ ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలుస్తున్న రామకృష్ణ ఆర్కే ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు. నాయకులు గొండెపూడి భాస్కరరావు తోట మల్ల వరప్రసాద్ .పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.