Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కరాటే ఆత్మరక్షణకు దోహదపడుతుంది

–కరాటేలో రాణించిన విద్యార్థులకు బెల్టుల ప్రధానం

వేములవాడ, మార్చి 30,(నిజం చెపుతాం) వేములవాడ పట్టణంలోని మహా నందీశ్వర్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో సుమారు 120 మంది విద్యార్థిని, విద్యార్థులు వివిధ స్థాయి బెల్టులను సాధించినట్లు ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ సంస్థల ఛీప్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మసైర్యం, క్రమశిక్షణ, శారీరక దారుడ్యం ఎంతైనా అవసరమని సూచించారు. ఈ యుద్ధ విద్యయొక్క ప్రాముఖ్యతను వివరించారు. చీఫ్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నాన్ మాట్లాడుతూ కరాటే శిక్షణ వలన విద్యార్థుల్లో ఏకాగ్రత పట్టుదల ఆత్మస్థైర్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు. అనంతరం బింగి మహేష్ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు కరాటే బెల్టులను, సర్టిఫికేట్లను అందజేశారు. విద్యార్థినులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నట్లు ఛీప్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నన్ తెలిపారు. నూతనంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బింగి మహేష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రజినీకాంత్ కు కరాటే స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంకెపల్లి ఎంపిటిసి బుర్ర లహరి- శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకులు పీర్ మహమ్మద్, సీనియర్ కరాటే మాస్టర్లు ఆర్ విజయ్, రజినీకాంత్, దండుగల తిరుపతి, లోలోపు రాజు, దండుగల దేవరాజు, మల్లపాటి తిరుపతి, కనికరపు రాజశేఖర్, విద్యార్థులతో పాటు విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.