Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చౌదరి కూడా గ్రామ పంచాయతీలో అవినీతికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు

  • ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 23,( నిజం న్యూస్)

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదర్ గూడా గ్రామపంచాయతీని *రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సందర్శించి ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని నూతన నిర్మాణాలు, పర్మిషన్లు లో అధికారులు అవినీతికి పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను సూచించారు. అధికారులు ఎవరైనా సరే ప్రజలను ప్రలోభ పెట్టి అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గ్రామ ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు ఎవరైనా డబ్బులు ఆశిస్తే బాధితులు నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చని, అవినీతికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,