Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కెసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్

  • రాగుల రాజు

జగిత్యాల, మార్చి 24 (నిజం చెపుతాం).

బి.ఆర్.యస్ పార్టీ సీనియర్ నాయకులు,
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు,
సంజయన్న సైన్యం అధ్యక్షులు రాగు ల రాజు
ప్రెస్ మీట్

కెసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే
ఎమ్మెల్సీ కవితను రాజకీయ కుట్రతోని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అరెస్ట్
చేయడం సరికాదని బి.ఆర్.యస్ పార్టీ
నాయకులు,సంజయన్న సైన్యం అధ్యక్షులు
రాగుల రాజు బిఆర్ఎస్ పార్టీ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల
నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాజకీయ లబ్ది
పొందేందుకు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడి అధికారులను
అడ్డుపెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేసారని,
సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన
హైదరాబాద్ కు వచ్చి అరెస్టు చేయడంలో ఆంతర్యం
ఏమిటని ప్రశ్నించారు.అక్రమ అరెస్టులకు,కేసులకు
భయపడేది లేదని వారు తెలిపారు, ఎప్పటికైనా
న్యాయం గెలిచితీరుతుందని,మళ్లి కవితక్క
ప్రజల్లోకి వచ్చిసేవ చేస్తారని ఆకాంక్షించారు,

కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో
ప్రవీణ్ కుమార్ చేరిక.

గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ
చేసిన అభివృద్ధి చూసి,పార్టీలో చేసిన
ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని వారు అన్నారు.
ఈ మేరకుశనివారం రాగుల రాజు మాట్లాడుతూ
ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ బి.ఆర్.యస్ పార్టీలో
చేరడం చాలా గొప్పనిర్ణయం అని గతపది సంవత్సరాలలో పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు
చూసి పార్టీలో చేరినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ,దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయ్యిందని,భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తారని,ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పై నమ్మకంతో
గొప్ప నిర్ణయం తీసుకున్నారని
హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు,ఓటర్లకు
అసెంబ్లీ ఎలక్షన్లలో మోస పూరితమైన హామీలకు
లొంగి కాంగ్రెస్ కు ఓట్లు వేసినట్లుగా,ఎంపీ ఎలక్షన్లో
కాంగ్రెస్ కు ఓట్లు వేయవద్దని మోసపూరితమైన
హామీలను నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి,
తెలంగాణ హక్కులకు కోసం పోరాడే ఏకైక
పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అందువలన
తెలంగాణ ప్రజలందరు తెలంగాణ ఓటర్లు
మన తెలంగాణ పార్టీ అయినటువంటి
బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఎంపీ ఎలక్షన్లలో
అత్యధిక స్థానాలను గెలిపించాలని
ఈ ప్రకటనలోరాగుల రాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు తొలిప్రేమ శ్రీనివాస్,రామడుగు సంజీవ్ ,
గోడిసెల శ్రీనివాస్ సాందరికారి సురేష్, జవ్వాజి శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.