Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాధితులకు రేకుల షెడ్డు నిర్మించి ఇచ్చిన ప్రజా ట్రస్ట్

లోకేశ్వరం, మార్చి 21 (నిజం చెపుతాం) ఆపదలో ఆపద్బాంధవుడిగా బాధిత కుటుంబీకులకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న మోహన్ రావ్ పటేల్ .లోకేశ్వరం మండలం వటోలి గ్రామానికి కి చెందిన పెద్ద భూమన్న, నడిపి సాయన్న ,వారి చిన్న సోదరుడి ఇండ్లు షాట్ సర్క్యూట్ తో ఇళ్లు దగ్ధం అయ్యాయి.విషయం తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ మోహన్ రావ్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణ సాయం నిత్యావసర సరుకులు కొంత నగదు అందించారు.

పెద్ద భూమన్న ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం తో వారికి తాత్కాలింగా ఉండడానికి మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో రేకుల షెడ్డు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి వారం తిరగకపొందే మోహన్ రావ్ పటేల్ ప్రజాట్రస్ట్ ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం తాత్కాలికంగా ఉండడానికి మూడు ఇల్లులు నిర్మించి ఇచ్చారు. గురువారం వారి కుటుంబ సభ్యులతో కలిసి మూడు ఇల్లు ప్రారంభించారు మోహన్ రావ్ పటేల్ .దీంతో కుటుంబ సభ్యులు మోహన్ రావ్ పటేల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.