Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బయ్యారం లో అనుమతులు లేకుండా ఇసుక రవాణా

  • పగటి పూట ఇసుకను దగ్గరికి తొడడం.
  • నిశి రాత్రి వేల… వేకువ జామున ఇసుక తొలకాలు.
  •  పోలీస్ స్టేషన్ లో ఇసుక ట్రాక్టర్..
  • నిముషాల వ్యవధిలో పోలీస్ స్టేషన్ లో ట్రాక్టర్ మాయం.
  •  తిరిగి మూడు గంటల వ్యవధిలో మరల ప్రత్యక్షం

నిజం చెబుతాం ఇల్లందు (21-03-24) ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండల కేంద్రం పరివాహక ప్రాంతం లో ఉన్నటు వంటి పాలవాగు,అలిగేరు కేంద్రంగా గత రెండు వారాల నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే కల్లు మూసుకొని, కర్తవ్యం మరచిన అధికారులు. ఈ రోజు వేకువ జామున 3:45 నిముషాల సమయంలో పాల వాగు లో అక్రమంగా ఇసుక ట్రాక్టర్ లోడ్ చెసి బయ్యారం ఎస్సి కాలనీ వద్ద పోలీస్ శాఖ పట్టుకున్న ట్రాక్టర్ SHO కు చేరిన నిమిషాల వ్యవధి లో ఎట్లా మాయం అవుతుంది.??
అధికార దుర్వినియోగం ఏ శాఖ నుండి జరిగింది,??
దీనికి అండ దండలు ఎవరి ప్రమేయం తో జరిగాయి అనే అనుమానం స్థానిక ప్రజల్లో కలిగింది.
బయ్యారం,మండల కేంద్రంలో గార్ల, బయ్యారం సర్కిల్ పరిధిలో అలిగేరు వాగులో గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా మండల అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.గురువారం తెల్ల వారు జామున ఇసుక అక్రమ రవాణా అధికారులు కండ్లు గప్పి మూడు ట్రాక్టర్ లు ఇసుక లోడును చేస్తుండగా పోలీసులు నమ్మదగిన సమాచారం ప్రకారం అందులో ఒక ట్రాక్టర్ లోడుతో వెలుతున్న దానిని ఎస్సి కాలనీ సమీపంలో పట్టు కున్నట్లు తెలిసింది. పట్టుకున్న పది నిమిషాలు కాక ముందే పోలీసు స్టేషన్ నుండి తమ పలుకు బడితో విడిపించుకొని పోయారని సమాచారం.ఈ ట్రాక్టర్ తో ఇసుక డంపులు చేసుకొని 50నుండి 100 ట్రిప్పుల ఇసుక సిసి రోడ్ కాంట్రాక్టర్ కు విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాత్రి పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ కు ఎటువంటి ఇసుక అనుమతులు,వాహనానికి సరియైన పత్రాలు లేకుండా పోలీసులు ఎలా వదిలి పెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు. వాహనం పెట్టుకున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి పోలీసు అధికారితో ఫోన్ చేసి మాట్లాడి పట్టు బడిన ట్రాక్టర్ విడిపించుకొని పోయినట్లు సమాచారం..?
దీని పై సిఐ రవి కుమార్ను వివరణ కోరగా మానవాతా దృక్పథంతో పార్టీ ఆఫీసు కు ఒక ట్రిప్పు ఇసుక తోలుకునేందుకు సరే అన్నా,తప్పా నాకే డంకీలు కొట్టి ట్రాక్టర్ విడిపించుకొని పోతాడని అనుకోలేదని, యాదృచ్ఛికంగా జరిగిన తప్పిందమని మరోసారి జరుగదని అక్రమ ఇసుక రవాణా దారుల పట్ల రాబోయే రోజుల్లో చట్ట పరంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అనంతరం పై స్థాయి అధికారులకు సమాచారం చేరడంతో తిరిగి ఆ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా గార్ల మండలం మర్రిగుడానికి చెందిన ప్రముఖ వ్యక్తి అలుగేరులోని ఇసుకను అక్రమంగా తరలించి దాని మాటున బాక్సైట్ ఖనిజాన్ని రాయలసీమకు చెందిన ప్రముఖ వ్యక్తి ద్వారా గార్ల మండలంలోని కొంతమంది రాజకీయ నాయకులను అండగా చేసుకొని ఖనిజాన్ని దోచుకోపోతున్నారని ఆ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాలను చెల్లించకుండా ఇసుకను, ఖనిజాన్ని అడ్డగోలుగా తరలించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇటువంటి వారిపై చర్యలు తీసుకొని ప్రజా సొమ్మును కాపాడాలని కోరారు.