Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

  • కె.ఎన్.ఆర్ యూవసేన జిల్లా నాయకుడు విజయ్ రాథోడ్

కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ పట్టణం మార్చ్ 13 (నిజం చెపుతాం ):-తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.ఎన్.ఆర్ యూవసేన జిల్లా నాయకుడు విజయ్ రాథోడ్ అన్నారు.బుధవారం విజయ్ రాథోడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తుందన్నారు.ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహలు ఉండాల్సిన అవసరం లేదన్నారు.ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో మహిళలు సౌకర్యాన్ని ఉపయోగించుకొని.పెద్ద ఎత్తున ఆనందపడుతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి స్పష్టంగా కనబడుతుందని వెల్లడించారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మాపీ చేయడం.రూ”500 లకే సిలిండర్ అందించడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున మేలు చేసే విదంగ ఉంటుందని ఆయన వివరించారు.ఏది ఏమైనా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం జనాల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.