సర్పంచ్ సుమతి అద్వర్యం లో కరోనా నిర్మూలన అవగాహన సదస్సు
పేరాయి గూడెం గ్రామపంచాయతీ ఇందిరా కాలనీ లో సర్పంచ్ సుమతి కరోనా నిర్మూలనకు అవగాహన సదస్సు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమతి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ని తక్కువగా అంచనా వేయొద్దు అని ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దని ప్రతి ఒక్కరు కూడా మాస్కు తప్పనిసరిగా వాడాలి, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవాలి శానిటైసర్ వినియోగించడం చేయాలి, కారణం లేకుండా ఎక్కువగా బయట తిరగవద్దు. భౌతిక దూరం పాటించాలి అని సూచించారు. అనంతరం పేరాయిగూడెం గ్రామపంచాయతీలో ఏవిన్యూ ప్లాంటేషన్ కి వాటరింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ దీపికలు, వివో అధ్యక్షులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు