Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ గూటికి ఖాసిం

.గుడూరు నుండి 6000 మందితో మహబూబాబాద్ జిల్లా జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఖాసిం కాంగ్రెసులో చేరడానికి సన్నాహాలు.

 

_15 మంది సర్పంచులు,

 

_ముగ్గురు ఎంపీటీసీలు మరియు, మాజీ ఎంపీటీసీ లతో చేరిక ,

 

_బి ఆర్ ఎస్ గ్రామ పార్టీల అధ్యక్షుల తో,

 

_ఇద్దరు కో ఆపరేటివ్ డైరెక్టర్స్ తో,

 

_మండల గ్రామ టిఆర్ఎస్ నాయకులు ప్రజలు ఖాసిం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరే యోచన.

 

_గూడూరు మండలంలో బిఆర్ఎస్ కాళీ కానుంది

 

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, మార్చ్ 13, (నిజం న్యూస్):

 

మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ ఖాళీ కానుందా ?. “నిజం” ప్రతినిధికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తుంది.

సుమారు 6000 మందితో మహబూబాబాద్ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఖాసిం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇదే నిజమైతే మండలంలో గట్టి పట్టున్న జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఖాసిం బిఆర్ఎస్ పార్టీని తన కార్యకర్తలతో నాయకులతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వెం నరేందర్ రెడ్డి మరియు మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ను , వెన్నం శ్రీకాంత్ రెడ్డి ని సంప్రదించి ముహూర్తం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

సుమారు 6000 మందితో కాంగ్రెస్ పార్టీలో కాసిం గనక చేరితే జిల్లాలో ఇది ఒక సంచలమైన వార్త.

మండలంలో ఖాసీం ను అనుసరించే నాయకులలో 15 మంది మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు మాజీ ఎంపీటీసీ లు కాసిం ప్రధాన అనుచరులు అయిన మాజీ సర్పంచ్ లు ముక్క లక్ష్మణరావు, సుధాకర్ రావు చక్రు తండ మాజీ సర్పంచ్ మంగ బాలాజీ నాయక్,

చక్రు తండా గ్రామ కమిటీ అధ్యక్షులు లక్కం సంజీవ ఉప సర్పంచ్ బానోతు లింబ ముగ్గురు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు బి ఆర్ ఎస్ గ్రామ పార్టీల అధ్యక్షులు ఇద్దరు కో-ఆపరేటివ్ డైరెక్టర్స్ మండల గ్రామ బిఆర్ఎస్ నాయకుల తో సహా పార్టీ మారే ఆలోచనలో జడ్పీ కో ఆప్షన్ మెంబర్ కాసిం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పిటిసిగా గెలుపొందిన కాసిం.

ప్రస్తుతం అదే తన సొంత గూటికి వెళ్తున్న ప్రజా నాయకుడైన కాసిం. ఇదే జరిగితే గూడూరు మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ ఖాళీ అయినట్లేనని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు.

తన నాయకులతో అనుచరగనంతో చేరటానికి సరి అయిన సమయం, ముహూర్తం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకొనే నాయకుడు ఖాసీం ఎటు వెళ్తే తనతో పాటే మేముకుడా వెళతాం అని మండల నాయకుల కార్యకర్తలు అంటున్నారు

పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖాసీం చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుంది అని కాంగ్రెస్ నాయకులు అనుకుంటుంన్నారు.