Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. మరింత బలోపేతానికి కృషి చేయాలి

చేవెళ్ల, మార్చి 11 (నిజం న్యూస్ ప్రతినిధి) :
చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కానీ మరింత బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీం భరత్ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్నం సునీతా రెడ్డి మాట్లాడుతూ.. ముప్పై, నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉండడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన కూడా పార్టీ మారకుండా ఉండి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ స్వల్ప తేడాతో విజయం సాధించలేకపోయిన కూడా, భారీ మెజారిటీ తీసుకురావడం మామూలు విషయం కాదని, గొప్ప విషయమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఐక్యమత్యంతో ఉండి, మరింత కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. కష్టపడి పనిచేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తమ సహకారం ఉంటుందన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన వారే గొప్ప నాయకులు కావాడానికి అవకాశం ఉంటుందన్నారు. దానికి నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో డోర్ టు డోర్ ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో అంతర్గతంగా కొంత సమన్వయం లోపంతో జాప్యం జరిగడంతో స్వల్ప తేడాతో విజయం సాధించలేకపోయామని, కానీ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అందరు ఐక్యమత్యంతో ఉండి అభ్యర్థిని గెలిపించుకుందామని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పటినుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేవరకు కూడా కాంగ్రెస్ పార్టీ పాత్రనే ఉంది. కానీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పాత్ర ఎక్కడ కూడా లేదన్నారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శిలాఫలకం వేయగా, పనులు కొనసాగుతుండగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే పనులు ఆపేశారని గుర్తు చేశారు. ఇలా మన ప్రాంతానికి బీఆర్ఎస్ అన్యాయం చేసిందని తెలిపారు. అదేవిధంగా బీజేపీ జాతీయ హోదా ఇవ్వకపోగా, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని దొంగ చాటుగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అక్కడ జాతీయ హోదా ఇచ్చారు. జాతీయ హోదా ఇచ్చిన కూడా అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టి, ఏవిధంగా నైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, అదేవిధంగా అక్కడ కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి విజయమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రాబోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు నాలుగు లైన్ల రహదారి వేయాలని తను ఎంతో కృషి చేశానన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ నాలుగు లైన్ల రహదారి కొరకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదన్నారు. అటు గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన పనులు ముమ్మరం చేశారన్నారు. అలాగే రిజనల్ రింగు రోడ్డు కూడా మన ప్రాంతం నుంచే పోయే విధంగా ప్రభుత్వం రూపకల్పనలు చేస్తుందన్నారు. శుక్రవారం రోజు మహిళలకు రూ.2500 లు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపి, అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని ఋణాలు ఇచ్చే పథకాలను సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని తెలిపారు. అంతకుముందు భీం భరత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగానైతే కష్టపడి పనిచేశామో అంతకుమించి రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు సాధించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, షాబాద్ దర్శన్, జనార్దన్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటారెడ్డి‌, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాప్ రెడ్డి, నాయకులు మధుసూదన్ గుప్తా, పడాల ప్రభాకర్, వెంకట్ రెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు వీరెందర్ రెడ్డి, శంకర్ పల్లి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నవాబు పేట్ మండల అధ్యక్షులు వెంకటయ్య, షాబాద్ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, మొహినాబాద్ మండల అధ్యక్షులు తమ్మల్లి మాణెయ్య, కాంగ్రెస్ నాయకులు పెంటయ్య గౌడ్, కంజర్ల భాస్కర్, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల మండల యూత్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, షాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు అశ్విని, షాబాద్ మండల మైనార్టీ అధ్యక్షులు అశియోద్దీన్, షాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటారెడ్డి‌, బీ బ్లాక్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.