Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బలరాం నాయక్

మహబూబాబాద్ ,జిల్లా ప్రతినిధి, మార్చి 8,( నిజం న్యూస్):మహబూబాబాద్ ఎస్టి పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున సుమారు 48 మంది ఆశావహులు పోటీ చేయడానికి ఉత్సాహంతో పోటీపడి పార్లమెంట్ నియోజకవర్గంలోని, అసెంబ్లీ నియోజకవర్గాలలో తమదైన శైలిలో ప్రచారం చేశారు. చివరకు మాజీ కేంద్రమంత్రి, బలరాం నాయక్ కె కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. గత శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చేసిన తీవ్ర ప్రయత్నం సఫలీకృతం కానందున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థిగా మీరే ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ఆశావహులు ప్రయత్నాలు చేశారు. చివరకు టికెట్ల రేసులో విజేతగా నిలిచిన బలరాం నాయక్. మహబూబాబాద్ ఎస్పీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. అందులో భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి గెలువగా, ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందులో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి, జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. గతంలోనే మంత్రి పొంగులేటి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని అభ్యర్థులను గెలిపించి తీరుతానని అనటం జరిగింది. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కు మంత్రి పొంగులేటి కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుంది. బలరాం నాయక్ గెలుపు నల్లేరు మీద నడికేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.