Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జాతర మహోత్సవాలకు” ఏర్పాట్లు … ముస్తాబవుతున్న ఆలయాలు

చర్ల మార్చి 7 (నిజం న్యూస్) శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని పార్వతి పరమేశ్వరుని మహోత్సవ వేడుకలకు శైవ క్షేత్రాలు ముస్తాబు అయ్యాయి భద్రాచలం మన్యం చర్ల మండలంలోని మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే తేగడ మహా జాతరకు ఎల్లమందల వంచీయులు శ్రావణ్ కుమార్ భాను ప్రకాష్. ఆలయ కమిటీ. దాతల సహకారంతోసర్వం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక్కడ తరతరాల నుండి.జరిగే జాతర మహోత్సవానికి కొత్తగూడెం జిల్లాల తో పాటు సతీష్ గడ్ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తు జనం తరలివస్తారు ఈ జాతర మహోత్సవం లో ఒళ్ళు గ గులు పొడిచే నారసాల సంబరాలు చూసేందుకు భక్త జనం పోటి పడుతూ ఇనుప సులాలతో బుగ్గలకు నాలుకకుపొడుచుకొనే ఘట్టం భక్తులను అబ్బుర పరుస్తాయి జాతర లో పాగోల సంబరాలు తెల్లవారుజామున. భక్తు లు ఉపవాసాలతో అగ్నిగుండంలో నడవడం కార్యక్రమం వైభవ పేతంగా జరుగుతుంది.

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు భద్రకాళి అమ్మవారి తమ ఆడపడుచులు అనే నానుడితో సరిహద్దు గ్రామాల ఆదివాసీ మహిళలు స్వామివారి కల్యాణానికి గోటితో వలసిన తరంబరాలు తీసుకొని తండోపతండాలుగా తరలివస్తారు ఈ జాతర మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున అమర్చిన ప్రభలను భక్తులు ఊరేగింపుగా వచ్చి కళ్యాణ సమేతుడైన వీరభద్ర స్వామి మొక్కుబడులు గా తరలి వస్తారు. ఈ మహాశివరాత్రి మహోత్సవాలకు కలివేరు మా లింగేశ్వర స్వామి ఆలయం పాత చర్లలోని శివాలయం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.