ఖమ్మం, వరంగల్, నల్లగొండ, “పట్టభద్రుల ఎమ్మెల్సీ “ఎన్నికల సమీక్ష సమావేశం…

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల “ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా” సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, హాజరయ్యారు. మండలంలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ గురించి బాధ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ సమయం ఉన్నందున గ్రామాలలో మిగిలిన పట్టభద్రుల ఓట్ల నమోదు వేగవంతం చేసి అందరిని చేర్పించాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరు మధుసూదనరావు , సర్పంచ్ కిషన్ లాల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నర్సింహారావు, రామిశెట్టి రాంబాబు, యదళ్ళపల్లి వీరభద్రం, నర్వనేని పుల్లారావు, లేళ్ల గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ జవహర్ లాల్ దితరులు పాల్గొన్నారు.