Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నాలుగు నెలల్లో ఐదుగురు తహసిల్దార్లు బదిలీ 

అయోమయంలో.. మండల ప్రజలు

చర్ల మార్చి 1 (నిజం న్యూస్) మండల రెవెన్యూ కార్యాలయాలంలో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…గడిచిన నాలుగు నెలల్లో ఐదుగురు తహసీల్దార్లు మారారు..

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రోజు ఏ తహశీల్దార్ ఉంటాడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెగ్యులర్ ఉన్న తహశీల్దార్ బదిలీపై వెళ్లారు..

కొద్ది రోజులు తిరగ ముందే ఆ తహశీల్దార్ బదిలీపై వెళ్లి మరో వ్యక్తి తహశీల్దార్ గా జాయిన్ అయ్యారు…. వారం రోజులు తిరగకుండానే తాహసిల్దార్లను బదిలీ చేయడంతో మండల ప్రజలు అయోమయంలో పెడుతున్నారు.

కార్యాలయానికి వెళితే ఎవరు తాహసిల్దారో అర్థం కాని పరిస్థితి నెలకొంది దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు

కుల .ఆదాయ. పట్టాల మార్పిడిపై కార్యాలయానికి వెళితే ఒకరోజు ఉన్న తాహసిల్దార్ రెండో రోజు లేకపోవడం ఎవరు తాహసిల్దార్ అర్థం కాని పరిస్థితి ఉందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు

చర్ల కు రెగ్యులర్ తాహసిల్దార్ ను నియమించాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు