Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఘనంగా సిల్వర్ డేల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

చేవెళ్ల, ఫిబ్రవరి 29 (నిజం న్యూస్ ప్రతినిధి) :
చేవెళ్ల మండల కేంద్రంలోని సిల్వర్ డేల్ స్కూల్ వార్షికోత్సవాన్ని యాజమాన్యం కేజీఆర్ గార్డెన్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ సాహిత్య పరిషత్ సంఘటన్ కార్యదర్శి, ప్రముఖ వక్త భాస్కరయోగి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అంజన్ గౌడ్, విశ్రాంత ఉపాధ్యాయులు చేగూరి బోజిరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులును ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి యోగ క్షేమాలతో పాటు వారి మానసిక పరిస్థితిపై కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు పిల్లలను అలవాటు చేయాలన్నారు. చిన్నారులు విద్య పట్ల భయం లేకుండా విద్యను ఇష్టపడి అభ్యసనం చేసే పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు కల్పించాలని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఇండ్లలో తల్లిదండ్రులు ఎవైనా సమస్యల దృష్ట్యా పిల్లల ముందు గొడవ పడకూడదన్నారు. ఎందుకంటే ఇళ్లలోని వాతావరణం కూడా విద్యార్థులపై ప్రభావం చూపుతుందన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కేరీర్‌లో స‌క్సెస్ అవ్వ‌లంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య ఎంతో అవ‌సర‌మ‌న్నారు. అంతకుముందు పాఠశాల యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మోనాచారి, ప్రిన్సిపాల్ సునీతా రెడ్డి, మంజుల మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.