Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • మోడీప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి .
  • ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్.

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 29 (నిజం చెపుతాం): పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి, కార్మిక లోకాన్ని ఆదుకోవాలని బుచ్చన్న యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గురువారం రోజున జిల్లా లేబర్ కమిషనర్ కి, కలెక్టర్ ఏవో సుధాకర్ కి సమర్పించారు. ఈ సందర్భంగా కటిక రెడ్డి బుచ్చయ్య యాదవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు సంపన్న వర్గాలకు దేశ సంపదలు దోచిపెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక పక్షం వైపు లేదని కార్పోరేట్ వైపు ఉందని కార్మిక చట్టాలను కార్పొరేట్ అధిపతులకు అనుకూలంగా మార్చడాన్ని బుచ్చన్న విమర్శించారు.60 సంవత్సరాలు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులను రాష్ట్రస్థాయి సలహా బోర్డులో సభ్యులుగా చేర్చాలన్నారు. కార్మికుల పని అడ్డాల వద్ద అన్ని మౌలిక వసతులు ప్రధానంగా షెల్టర్లు మంచినీటి సౌకర్యం,బాత్రూముల కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా, సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు, పెండ్లి కానుక సహాయం ఒక లక్ష పెంచాలని పిల్లల చదువుకు స్కాలర్షిప్ ఇవ్వాలని ఆయన కోరారు. అర్హులైన ఇండ్లు లేని కార్మికులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని, నూతనంగా రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.
ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో కటికిరెడ్డి బుచ్చన్నతోపాటు ఎస్ కె సుల్తాన్,సదానందం ఏం వంశీకృష్ణ,రజాక్, సుబ్బారావు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.