Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిజం పత్రిక వార్తకు స్పందించిన గ్రామపంచాయతీ అధికారులు- నిజం ఎఫెక్ట్

  • చీకట్లో వీడి వెలుగు వచ్చిన ఉప్పరగూడెం గ్రామపంచాయతీ.

కురవి నిజం చెపుతాం,ఫిబ్రవరి ,28:వికలాంగులకు వృద్ధులకు చీకట్లో తంటాలు అనే నిజం పత్రికల్లో ప్రచురించగా ఉప్పరగూడెం సెక్రెటరీ మరియు ఎంపీడీవో అధికారులు వెంటనే స్పందించి,దళితవాడలో వీధిలైట్లు అమర్చడం జరిగింది.ఇన్ని రోజులుగా చీకటిలో ఆపసోపాలు పడుతూ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డామని మా బాధలు తంటలను చూసి నిజం పత్రిక విలేఖరి స్పందించి వార్త ప్రచురించగా ఉప్పరగూడెం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీడీవో స్పందించి ఊరికి వీధిలైట్లు అమర్చడం జరిగిందని,గ్రామంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజాలు నిర్భయంగా పత్రిక లో రాసిన విలేఖరికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.