Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భూ బకాసురుల కోరల్లో పోతిరెడ్డి చెరువు కుంట

  • కాకతీయుల కాలంలో నిర్మించిన 11 గొలుసు కట్టు చెరువు ల్లో 6 చెరువులు మాయం.
  • 5 చెరువుల్లోని శిఖం భూములు గత ప్రభుత్వ పాలకుల, వారి అనుచరుల చేతుల్లో.
  • పోతిరెడ్డి చెరువు కుంటలో శిఖం భూమి లో ఉన్న గుట్టలను సైతం చదును చేస్తున్న వైనం.
  •  జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు నిద్రమత్తును వీడాలి.
  • జిల్లా పాలనాధికారికి 11 గొలుసు కట్టు చెరువుల పై వాస్తవ ని వేదిక ఇవ్వాలి.
  • నిజం పత్రికలో” బంధం” చెరువు పై ప్రచురించిన వార్తా కథనంపై వెంటనే స్పందించిన జిల్లా పాలనాధికారి.
  • భూ ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ, శిఖం భూములను జిల్లా పాలనాధికారి వెంటనే స్వాధీనం చేసుకోవాలి.
  • 11 గొలుసు కట్టు చెరువులలోని శిఖం భూములు ఏ మేరకు కబ్జాకు గురి అయ్యాయో నిజాయితీగల అధికారుల తో విచారణ జరిపించాలి.
    “నిజం ప్రత్యేక కథనం”.
    మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23,( నిజం న్యూస్): మహబూబాబాద్ పట్టణం జిల్లాగా రూపాంతరం. చేoదగానే పట్టణంలోని భూములకు రెక్కలు (అధిక ధరలు) వచ్చాయి. అవి పట్టా భూములా, ప్రభుత్వ భూములా, చెరువు శిఖం భూములా అనేది వారికి అప్రస్తుతం. గత ప్రభుత్వం లోని పాలకులు, వారి అనుచర గణం అధికారులను ప్రలోభ పెట్టో, అధికార బలం చూపో ప్రభుత్వ, శిఖం భూములను ఆక్రమించి అట్టి భూములను చదును చేసి ఫ్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్మి లక్షలాది రూపాయలను దోచుకున్న ఈ రాజకీయ రాబందుల నుండి అట్టి భూములను స్వాధీనం చేసుకోవాలనీ జిల్లా పాలన అధికారిని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.

  • “ఆనాటి ఇంజనీర్ల ప్రతిభ” కాకతీయుల కాలంలో రైతులకు సాగు, త్రాగునీరు అందించే విధంగా ఆనాటి వర్షపు నీటిని మళ్లింపు పద్ధతిలో రాబోయే తరాలకు భూగర్భ జలాలతో కలకలలాడేలా11 గొలుసు కట్టు చెరువులు నిర్మించారు.ఆనాటి పట్టణం నేడు జిల్లా కేంద్రంగా మారడంతో నేటి జిల్లా కేంద్రంలో ఉన్న 11 గొలుసు కట్టు చెరువులు  నిజాం చెరువు, బంధం చెరువు, కృష్ణ సాయి కుంట, జగన్నాయకుల చెరువు, రామ్ భద్రం చెరువు, నానమ్మ కుంట, దామెర చెరువు, పోతిరెడ్డి కుంట, కంబాల చెరువు, నల్లకుంట, గుండ్లకుంట, గొలుసు కట్టు చెరువులుగా నిర్మాణం చేశారు. “గొలుసు కట్టు చెరువులు అనగా”! ఒక చెరువు వర్షపు నీటికి నిండగానే ఆ చెరువు అలుగు పోస్తుంది. అలుగు పోసే నీటిని మరొక చెరువుకు మళ్లించి ఆ చెరువును నింపే విధంగా ఆనాటి ఇంజనీర్ల వ్యవస్థ ఈ 11 గొలుసు కట్టు చెరువుల నిర్మాణాలను అద్భుతంగా చేపట్టారు. ప్రజల సాగు, త్రాగునీటి కొరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల సేవే తమ పరమావధిగా భావించి అద్భుతమైన రీతిలో 11 చెరువులను నిర్మించి ఆనాటి ప్రజల మన్నులను పొందారు. (మరి ఈనాడు డ్యాములు కట్టిన సంవత్సరంలో కూలడమో, మరో విధమైన డ్యామేజీ కావడం మనం చూస్తున్నాం). ఆనాడు నిర్మించిన ఈ 11 గొలుసు కట్టు చెరువులు సాగు, త్రాగునీటి కి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి.”మిగతాది రేపటి సంచిక లో” కొరివి మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ శిఖం భూమి సుమారు 15 ఎకరాలు ఆక్రమించి పట్టా చేయించుకుని
  • “”రైతుబంధు”ను తీసుకుంటున్న ఒక బిఆర్ఎస్ నాయకుని కథనం అతి త్వరలో.