Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పైసలిస్తే సరి లేకుంటే ఉరి

  • పౌల్ట్రీ ఫామ్ యజమాని ఇస్లావత్ సుశీల

స్టేట్ బ్యూరో ఫిబ్రవరి 20 (నిజం న్యూస్) తన పౌల్ట్రీ ఫామ్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమైనయని ఇస్లావత్ సుశీల, ఇస్లావత్ తండా మాధవపురం గ్రామానికి చెందిన వీరు తన పౌల్ట్రీ ఫామ్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని మాజీ సర్పంచ్ ఇస్లావత్ నరేష్ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పౌల్ట్రీ ఫార్మ్ నడుపుతున్నారని పత్రికలకు వార్త పంపిస్తానని మమ్ములను బెదిరిస్తూ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మేము ఐదు లక్షలు ఇవ్వలేమని అంటే మధ్యవర్తుల ద్వారా మూడు లక్షలైనా ఇవ్వండని ఒత్తిడి చేశాడు. అతను సర్పంచ్ పదవిలో ఉన్నంత మటుకు ఎలాంటి ఆరోపణలు చేయని ఈ మాజీ సర్పంచ్ నరేష్ తన సర్పంచ్ పదవీకాలం ముగుస్తుండగానే నా పౌల్ట్రీ ఫామ్ పై అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి అనుమతులు లేవని నేను అక్రమంగా నడుపుతున్నానని కొన్ని దినపత్రికలకు వార్తను పంపి అసత్య ప్రచారాల కు పాల్పడుతున్నా డు. మహిళనైన నేను నా సొంత భూమిలో ఒక పౌల్ట్రీ ఫామ్ ను గత ఐదు సంవత్సరముల నుండి నడుపుతూ సుమారు పది కుటుంబాలకు జీవనోపాది కల్పిస్తున్నాను. తద్వారా నా కుటుంబం కూడా బ్రతుకుతుంది. ఈ పౌల్ట్రీ ఫార్మ్ ద్వారా నేను నిజాయితీగా అన్ని అనుమతులు పొంది వ్యాపారం చేస్తున్నాను. మాజీ సర్పంచ్ నరేష్ అతను సర్పంచ్ గా ఉన్న కాలంలో ఎన్నో అవినీతి పనులు చేశాడు. అతను పదవిలో ఉన్న కాలంలో ఉప సర్పంచ్ అయినా ఒక గిరిజన మహిళ సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామపంచాయతీ డబ్బులు స్వాహా చేసిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇతనిపై విచారణ జరిపి సర్పంచ్ పదవి నుండి తొలగించడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అవినీతి పనులు చేస్తూ తనను కూడా డబ్బులు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ తనకు దగ్గరైన పత్రికల ద్వారా అసత్య ప్రకటనల చేయించిన అతనిపై సదరు పత్రిక విలేకరి పై పరువు నష్టం దావా వేస్తానని ఇస్లావత్ సుశీల ఒక ప్రకటనలో తెలిపారు.