ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించాలి. డీఈవో సోమశేఖర శర్మ గుండాల, ఆల్లపల్లి మండలాల్లో ఆకస్మిక తనిఖీ

ప్రతి విద్యార్థికి ఆన్ లైన్ ద్వారా ఉత్తమ విద్యను అందించాలని, ఆన్లైన్ విద్య ప్రతి విద్యార్థికి అందేలా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మంగళవారం గుండాల, ఆల్లపల్లి మండలాల్లో పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆళ్లపల్లి మండలంలోని పాతూరు ప్రాథమికోన్నత పాఠశాల, ఆళ్ల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ తరగతులకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేకపోవడం పట్ల సంబంధిత ఉపాధ్యాయులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఏ రూల్స్ అనుసరించి ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేపల గడ్డ, జగ్గు తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు. ఆయన వెంట మండల విద్యాధికారి అజ్మీరా జగన్ ఉన్నారు.