Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హరే రామచంద్ర! ఏమిటి ఈ “బంధం”వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 20, (నిజం న్యూస్): పట్టణంలోని నడిబొడ్డున ఉన్న బంధం చెరువు పై హరే రామచంద్ర! ఏమిటి ఈ “బంధం”అనే శీర్షికన 19వ తేదీన “నిజం” దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన జిల్లా పాలనాధికారి అద్వైత్ కుమార్ సింగ్. బంధం చెరువు కట్ట పైన తిరుగుతూ, చెరువుకు సంబంధించిన శిఖం భూములు ఏవిధంగాఅన్యాక్రాంతమైనయో స్వయంగా పరిశీలన జరిపారు. సంబంధిత అధికారుల ద్వారా మ్యాపులను పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వ్యక్తులు చెరువు భూములను ఎంత మటుకు కబ్జా చేశారు?, అని మ్యాపుల ద్వారా పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి.

ఈ బంధం చెరువులో నీ శిఖం భూములలో వెలిసిన బహుళ అంతస్తుల భవనాలకు స్థానిక మున్సిపాలిటీ అధికారులు, స్థానిక సబ్ రిజిస్టర్ అధికారులు ఈ చెరువు శిఖం భూములకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు?, రిజిస్ట్రేషన్లు చేశారు?. సవివరమైన విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు రావచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. శిఖం భూములకు సంబంధించి న భూములను ఎవరు అమ్మారు?, ఎవరు కొన్నారు?,అన్న వివరాలను పూర్తిస్థాయిలో విచారణ జరిగితే అన్ని వివరాలు బయటకు వస్తాయని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్న బంధం చెరువు కట్టకు ఈవతల మెయిన్ రోడ్డుకు అనుకొని ఉన్న కోట్లాది రూపాయల భూమి సుమారు 5 ఎకరాల భూమి ఎవరిది?, ఎవరు ఎవరికి అమ్మారు?, ఈ భూమిని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగినవి?. ఈ రాజకీయ రాబందులు, ఈ రాజకీయ నాయకుల అనుచర గణాలు సుమారు ఈ ఐదు ఎకరాల భూమిని చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ నాటారు?,అన్న వివరాలు మొత్తం ప్రజలకు తెలియాలి అనుకుంటే జిల్లా పాలనాధికారి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, వెంటనే విచారణ కమిటీ వేయాలని ప్రజలు కలెక్టర్, ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేస్తున్నారు.