Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కురవి శ్రీ వీరభద్రుడి ధర్మపీఠం ఎవరికి దక్కనుందో..?

-పదవీ కోసం పైరవీలు.
-ఓ నాయకుని కోసం మహబూబాబాద్ ఓ మాజీ ఎమ్మెల్యే ఫైరవీ.
-ఫైరవీ దారులకేనా పట్టాభిషేకం..?
-పాలన, పాలకులు మారినా సామాజిక వర్గానికి న్యాయం జరిగేనా..?
-ధర్మాపీఠానికి దళితులు అనర్హులా..?
-గత పాలనలో దళితుల పట్ల చిన్న చూపు.
– ఈసారైనా దళితులకు పీఠం దక్కేనా?
-“రామచంద్ర” గత పాలకుల అడుగు జాడల్లో నడుస్తారా..? ఆదర్శంగా నిలుస్తారా..? చూడాలి మరి.

కురవి,నిజంచెపుతాం,ఫిబ్రవరి,19:

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి ఆలయ ధర్మకర్త చైర్మన్ ధర్మపీఠం ఎవరిని వరిస్తుందోనని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.చైర్మన్ రామునాయక్ పదవి ముగిసింది. తదుపరి గత సంవత్సరం నుంచి అధికారులే నడిపిస్తున్నారు.ఏళ్లతరబడి శ్రీ వీరభద్రస్వామి పాలక మండలి కమిటీ చైర్మన్ గా దళిత సామాజిక వర్గం మినహా రాజుల వంశం,ఓసి,బిసి,ఎస్.టి సామాజిక వర్గానికి చెందిన వారికే ఆలయ కమిటీ చైర్మన్ పదవులు దక్కాయి. ఈసారి ధర్మకర్త చైర్మన్ పీఠం కోసం దళిత(ఎస్.సి) వర్గానికి చెందిన వ్యక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అన్నిరంగాల్లో పెద్ద పీటవేసినా.., అందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శ్రీ వీరభద్రస్వామి ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ గా ఇప్పటివరకు దళితులకు మినహా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి సీల్డ్ కవర్ ద్వారా పదవులు ఇచ్చారు.పాలన మారింది.పాలకులు మారారు.ఈ దఫా ధర్మకర్తల కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరాలుగా రాజులవంశం,ఓసి,బిసి,ఎస్టి గిరిజన వర్గానికి పాలక మండలి చైర్మన్ పదవి ఇచ్చారు.గత కొన్ని దఫాలుగా పాలక మండలి చైర్మన్ పదవి కోసం ఎస్ సి వర్గానికి చెందిన వ్యక్తులు ఎదురు చూశారు.కాని ఫలితం దక్కలేదు.దళితులకు దక్కుతుంది అనుకున్న క్రమంలో మళ్ళీ గిరిజన సామాజిక వర్గానికి చెందిన రామునాయక్ దక్కింది.దీంతో ఎస్సీ వర్గానికి చెందిన ఆశబావులు నిరాశ చెందారు.అయితే ఈసారి కచ్చితంగా ఎస్ సి(దళిత) వర్గానికి చెందిన వ్యక్తులు ఎదురుచూస్తున్నట్లు విస్వాసనీయ సమాచారం.

పాలక మండలి చైర్మన్ పదవి పొందిన వివరాలు :

శ్రీ వీరభద్రస్వామి ఆలయం 1964కు ముందు రెవెన్యూ పరిధిలో ఉంది.తదుపరి పాలక మండలి ఏర్పడింది.నాటి నుంచి శ్రీ వీరభద్రస్వామి ఆలయ ధర్మకర్తల చైర్మన్ గా వద్దుల బుచ్చిరెడ్డి,వెంకట్రాంరెడ్డి,రెండు దఫాలుగా అల్లూరి వెంకట్రామరాజు,నూకల రాజేందర్రెడ్డి,రెండు దఫాలుగా వద్దుల జోగారెడ్డి,నూతక్కి ప్రసాదావు,వద్దుల శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల వెంకట్ రెడ్డి,బండి లక్షమరెడ్డి,మేక దామోదర్ రెడ్డి, సోంశెట్టి శ్రీనివాస్,మూడు దఫాలుగా రాజునాయక్, రామునాయక్ లు ఇప్పటి వరకు రాజులవంశ,ఓసి,బిసి, ఎస్ టి సామాజిక వర్గానికి ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ పదవులు దక్కాయి.తదుపరి ఎస్ సి సామాజిక వర్గానికి ఈసారి పదవి వరించే అవకాశం కల్పించాలని ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

పదవీ కోసం పైరవీలు :

ఆలయ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న రామునాయక్ పదవి ఫిబ్రవరి 2023 మహాశివరాత్రి అనంతరం ముగిసింది. బిఆరెస్ పాలన ముగిసింది.కాంగ్రెస్ పాలన మొదలైంది. వచ్చే నెలలో మహాశివరాత్రి పర్వదినం జాతర ఉంది.ఈ నేపథ్యంలో అట్టి పదవీ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పటికే ఎవరికి వారు పైరవీ చేసుకుంటున్నట్లు విశ్వాసనీయ సమాచారం.కురవి మండలంలో ఓ నాయకునికి సఫోర్ట్ చేస్తూ చైర్మన్ పదవి ఇవ్వాలని మహబూబాబాద్ ఓ మాజీ ఎమ్మెల్యే గట్టిగా ఫైరవీ చేస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది.అంతే కాదు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బంధువు అందుకే స్థానిక ఎమ్మెల్యే అంగీకరించి చైర్మన్ పదవి అతనికే ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీంతో పార్టీ కోసం ఆర్థికంగా నష్ట పోయి సైనికుల్లా పనిచేసి..,చైర్మన్ పదవి కోసం ఎస్సి,బిసి,ఎస్టీ సామాజిక వర్గం సీనియర్ నాయకులు నిరాషకు గురౌతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చ్గించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సీల్డ్ కవర్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరి.ఎమ్మెల్యే రామచంద్రునాయక్ గత ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తారా..? ఆదర్శంగా నిలుస్తారా..?చూడాలి మరి.