Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆదర్శప్రాయుడు సంత్ సేవాలాల్ మహారాజ్

  •  మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, నిజం న్యూస్ ప్రతినిధి: మహారాజ్ శ్రీ సంత్ సేవాలాల్ అందరికీ ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 1739వ సంవత్సరంలోని అనంతపురం జిల్లా రాంజీ నాయక్ తండాలో జన్మించాలని అన్నారు. చిన్నప్పటినుండి మూఢనమ్మకాలపై పోరాటం చేసిన గొప్ప నాయకుడు సంత సేవాలాల్ అని ఆమె ఆయన సేవలను కొనియాడారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలోని గిరిజనులకు పెద్దపీట వేసి ఆదుకోవడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా గిరిజనులకు హైదరాబాద్ నడిబొడ్డు న గిరిజన సంక్షేమ భవనం కట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అమె పేర్కొన్నారు. అనంతరం దేవాలయ నిర్మాణ పనులను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి కార్పొరేటర్లు అరకల భూపాల్ రెడ్డి, రవి నాయక్, అనిల్ యాదవ్, రాజేందర్ రెడ్డి, ధనలక్ష్మిరాజు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, సిద్దాల బీరప్ప, గడ్డమీది లక్ష్మణ్ ,మేకల రవీందర్ రెడ్డి, శ్రీను నాయక్, రవి నాయక్, నాగరాజ్ ,అవినాష్ సోషల్ మీడియా కన్వీనర్ వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.