Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

“ప్రెస్ మీట్” – “మీట్ ది ప్రెస్” కి తేడా ఏమిటి…?

  • మీడియా రంగంలో “మీట్ ది ప్రెస్” కి ప్రత్యేక స్థానం.
  • ప్రస్తుతం కమర్షియల్ గా మారిపోయిన “మీట్ ది ప్రెస్”.
  • మీడియారంగంలో దిగజారి పోతున్న విలువలు.

ప్రెస్ మీట్, మీడియా సమావేశం.లేదా న్యూస్ కాన్ఫరెన్స్ అనేది పూర్తిగా జర్నలిస్ట్ లకు సంభం దించిన విషయం.దీనిలో ప్రముఖ వ్యక్తులు లేదా పలు రకాల సంస్థలు…, జర్నలిస్ట్‌లు మాట్లాడడం, ఎదుటి వారి సందేశాన్ని లిఖించడం,/చిత్రీకరించడం మరియు జర్నలిస్ట్ లు ప్రశ్నలు అడగడానికి ప్రెస్ మీట్ నిర్వాహకులు ఆయా ప్రాంతాల జర్నలిస్ట్ లతో సమావేశం నిర్వ హిస్తారు.ప్రెస్ కాన్ఫరెన్స్‌ల ను తరచుగా రాజకీయ నాయకులు,పలు కార్పొరేషన్‌ లు, ప్రభుత్వేతర సంస్థలు, అలాగే వార్తా విశేషమైన కార్యక్రమాల కోసం వాటి నిర్వాహకులు జర్నలిస్ట్ లతో నిర్వహించే కార్య క్రమం ప్రెస్ మీట్/ప్రెస్ కాన్ఫరెన్స్ గా పిలుస్తారు. ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వాహకులు ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తే అక్కడకు జర్నలిస్ట్ లు వెళ్ళి ప్రెస్ మీట్ కవర్ చేసుకోవలసి ఉంటుంది. కవరేజ్ నిర్ణయం అనేది జర్నలిస్ట్ ఇష్టా-ఇష్టాలపై ఆధారపడి ఉంటే….కొన్ని సందర్భాలలో ఆయా మీడియా సంస్థల ఆదేశాల కు అనుగుణంగా జర్నలిస్ట్ లు ప్రెస్ మీట్ లకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా వెళ్ళి కవరేజ్ చేయాల్సి వస్తుంది.ఇక ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడే వ్యక్తి తాను చెప్పాలి అనుకున్న అంశాన్ని చెప్పడమే గానీ..ఈ ప్రెస్ మీట్ ల ద్వారా జర్నలిస్ట్ లు ప్రశ్నలు-సందేహాలకు పెద్దగా ప్రాముఖ్యత అయితే ఉండదు.ప్రెస్ మీట్ నిర్వహించిన వారు వెల్లడించే సమాచారం సేకరించుకుని న్యూస్ కంటెంట్ రాసుకోవడం తప్ప పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పెనుగొండ రామారావు, సీనియర్ జర్నలిస్ట్. మహబూబాబాద్.

మీట్ ది ప్రెస్ అంటే ఏమిటి…?

మీట్ ది ప్రెస్ అనేది మనలో చాలామంది జర్నలిస్ట్ లకు తెలిసి ఉండకపోవచ్చు.కానీ నేటి జనరేషన్ లో జర్నలిస్ట్ లుగా రంగప్రవేశం చేస్తున్న వారికి ప్రెస్ మీట్ అన్నా…, మీట్ ది ప్రెస్ అన్నా….., రెండింటికి పూర్తిగా తేడా తెలియడం లేదు అంటే… ఆశ్చర్య పోవాల్సిన అంశం ఏమీ కాదు…మీట్ ది ప్రెస్ అనేది దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా రంగం లో కొన్ని దశాబ్దాలు గా సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ప్రత్యేక అంశం.
ఇక ఈ మీట్ ది ప్రెస్ అనేది మీడియా రంగంలో చాలా ప్రత్యేకం/ప్రాముఖ్య మైనది.దీనికి కొన్ని నియమ-నిబంధనలు ఉన్నాయి.ప్రెస్ మీట్ మాదిరి ఎవరు పడితే వారు,ఎక్కడ బడితే అక్కడ వేదిక ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఉండదు.ఈ మీట్ ది ప్రెస్ ని మీడియాలో పని చేస్తున్న జర్నలిస్ట్ లు, జర్నలిస్ట్ సంఘాలు,మరి ముఖ్యంగా ప్రెస్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమాలు జరుగు తాయి.గతంలో మీట్ ది ప్రెస్ అనేది ఎంతో నిష్పక్ష పాతంగా నిర్వహించ బడేది.సమాజంలో ప్రత్యేక ప్రొఫైల్ కలిగిన వ్యక్తులలో ప్రధానంగా రాజకీయ నాయకులు, పబ్లిక్ అఫైర్స్‌కు సంబంధించిన సమస్యలపై,అభిప్రాయా లు మరియు విశ్లేషణలను జర్నలిస్ట్ ల ప్రశ్నల ఆధారం గా సమాధానాలు రాబట్టు కునే దే మీట్ ది ప్రెస్.ఆ రోజుల్లో మీట్ ది ప్రెస్ కి ఆహ్వానం దక్కింది అంటే… ఆ రోజుల్లో ఆ ఆహ్వానం దక్కించుకున్న ఏ వ్యక్తి అయినా అదో పెద్ద గౌరవం గా భావించేవారు.చక్కగా తమ సొంత డబ్బా కొట్టుకోకుండా…జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వెళ్ళే వారు.చాలా వరకు ఈ మీట్ ది ప్రెస్ అనేది ఎంతో గౌరవంగా ప్రెస్ క్లబ్స్ లోనే జరిగేది గతంలో…,అలాగే మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏ జర్నలిస్ట్ లు నిర్వహిస్తే వారి సంఘం, యూని యన్,ప్రెస్ క్లబ్ పేరుతో బ్యాక్ రౌండ్ బ్యానర్లు ఉండేవి.అలా మీట్ ది ప్రెస్ కార్యక్రమాలు జరిగేవి. నాడు మీట్ ది ప్రెస్ కార్యక్రమం జర్నలిస్ట్ లు గౌరవప్రదమైన రీతిలో ప్రెస్ క్లబ్స్ లో జరిగేవి.ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయ బద్దం గా జరిగిన మీట్ ది ప్రెస్ ఇప్పుడు పూర్తిగా గాడి తప్పింది.జర్నలిస్ట్ లు నిర్వహించాల్సిన మీట్ ది ప్రెస్ ని మీడియా లబ్ది పొందాలి అనుకునే వారి చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈ క్రమంలో మీట్ ది ప్రెస్ -ప్రెస్ మీట్ కి చాలా వరకు వ్యత్యాసం లేకుండా పోయింది.

కమర్షియల్ గా మారిన “మీట్ ది ప్రెస్”….

మీడియారంగంలో గతం నుండి ఎంతో నిష్పక్షపాతంగా,సాంప్రదాయంగా..నడుస్తూ వస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఇప్పుడు కమర్షియల్ గా మారిపోయింది. కొంత మేరకు ప్యాకేజి ప్రోగ్రామ్ గా మారిపోయింది అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.గతంలో మాదిరి ఒక ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు గాక, ఇప్పుడు ఎవరు పడితే వారు కొంతమంది విలువ లు పాటించని జర్నలిస్ట్ ల సహకారంతో… సొంత ఖర్చులతో,స్పెషల్ ప్యాకేజీ లతో ప్రలోభాలు పెట్టి మీట్ ది ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ మీట్ ది ప్రెస్ లో గతంలో జర్నలిస్ట్ లు స్వతహాగా అన్ని ఏర్పాటు చేసేవారు.కానీ ఇప్పుడు ఏ ప్రొఫైల్ లేని వ్యక్తులు సొంత డబ్బులు ఖర్చుపెట్టి కొందరు జర్నలిస్ట్ లను ప్రలోభాలకు గురిచేసి జర్నలిస్ట్ లే మీట్ ది ప్రెస్ ఏర్పాటు చేసి తనను ఆహ్వానించినట్లు వ్యవహ రిస్తున్నారు.ఇక్కడ ఒకటే గమనించాలి.సమాజంలో విస్తృత ప్రచారం పొంది లబ్ది పొందాలి అని చూసే కొందరు వ్యక్తులు చిన్న చిన్న హోదాలు,పదవులు ఉంటే చాలు అటువంటి వారు…కొంతమంది జర్నలిస్ట్ లను,కొద్దిమంది జర్నలిస్ట్ సంఘాల నాయకులను, లేదా కొన్ని ప్రముఖ నగరాల ప్రెస్ క్లబ్ నిర్వాహ కులను ప్రలోభపెట్టి మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయించుకునే విధంగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.మీడియా సంస్థలు కూడా ఏమిటి ఇది…ఈ మీట్ ది ప్రెస్ ప్రాముఖ్యత ఏమిటి…అని ఆలోచించ కుండా వ్యవహరిస్తున్న తీరు వెనుక అంతర్గత రహస్యాలు ఏమిటో…!ప్రజాక్షేత్రంలో ఎవరికి తెలియని అంశం ఏమీ కాదు.పాత సామెత ఒకటుంది నన్ను ఎవరూ చూడటం లేదని పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగింది అంటారు కదా…!ఇప్పుడు ఆ సామెత కూడా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఆ…ఇప్పుడు కళ్ళు తెరిచి-మూసి కాదు ఇక్కడ త్రాగటమే ముఖ్యం అన్నట్లు మారింది వ్యవహారం. ఇక ఈ మీట్ ది ప్రెస్ కి అనువైన సమయం ఎన్నికలు.మరి రానున్న ఎన్నికలలోపు ఇక మీట్ ది ప్రెస్ కార్యక్రమాల కు సీజన్ ఆసన్నమైంది. అయితే…ఈ మీట్ ది ప్రెస్ అనేది పెద్ద పెద్ద నగరాలలో తప్ప చాలా వరకు ఇప్పటి దాకా పట్టణ ప్రాంతాల్లో నిర్వహించబడటంలేదు. అయితే ప్రస్తుతం ప్రతి ఏరియాలో జర్నలిస్ట్ లు పెరిగారు,జర్నలిస్ట్ ల సంఘాలు పెరిగాయి. అలాగే…అసోసియేషన్స్,యూనియన్స్,ఫోరమ్స్ అడ్డ దిడ్డంగా పుట్టుకొస్తు న్నాయి.మరో ప్రక్క తెల్లచొక్కా వేసిన ప్రతివాడి కి చెప్పుకోవడాని ఒక హోదా, ఆయా హోదాల్లో విస్తృత ప్రచారం పొంది, పలు విధాలా లబ్ది పొంద డానికి మీడియా వేదికలు అవసరం ఏర్పడింది.ఇంకే ముంది మీడియారంగంలో సాంప్రదాయంగా వస్తున్న మీట్ ది ప్రెస్ కొద్ది రోజులు గా కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో చిక్కి జర్నలిజం- జర్నలిస్ట్ ల విలువలు దిగజారిపోయెలా చేశారు. ప్రస్తుతం మీట్ ది ప్రెస్ అనేది కొంతమంది ప్రచార ఆర్భాటకుల,కొంతమంది విలువలు లేని జర్నలిస్ట్ ల చేత చిక్కి రోజు రోజుకు కునారిల్లుతుంది.సంతోషిం చదగిన విషయం ఏమి టంటే…ఇప్పటి వరకు మీట్ ది ప్రెస్ కొంత బెటర్… ఇక వేట మొదలయినట్లే…!ఎందుకంటే… 2024 ఎన్నికలు ముగిసే లోగా…. మీడియా వాడకం లో మీట్ ది ప్రెస్,ప్రెస్ మీట్ లా…ప్రెస్ మీట్ ని మీట్ ది ప్రెస్ లా మార్చి వ్యవహ వ్విరించే వారు మీడియానిb వివస్త్ర ను చేసి నడివీధిలో నిలుచోబెట్టి జర్నలిజం-జర్నలిస్ట్ ల సిగ్గు తీయడం తప్ప ఇక్కడ చెప్పుకోవడానికి
గొప్పలేమి లేవు.
పెనుగొండ రామారావు, సీనియర్ జర్నలిస్ట్, మహబూబాబాద్, 9440 40 38 38.