Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాప్తాడు లో జనం సముద్రం అయినా సిద్ధం సభ

  • ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి
  • సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి
  • తాగిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి

రాప్తాడు ఫిబ్రవరి 18 (నిజం చెపుతాం) రాయలసీమలో సముద్రం కనిపిస్తుంది. జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జనసముద్రం వస్తే, రాష్ట్రానికి జలసముద్రాం వచ్చింది. రాయలసీమ గడ్డకు రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య, ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎనుకునే ఎన్నిక కాదు, ఐదేళ్లకాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి, డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్దామా ఈ యుద్ధం, మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాటతప్పటమే ఆలవాటుగా ఉన్న పెత్తందారలకు మధ్య యుద్ధం, విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం, పేదవారు తరపున నిలబడటానికి మీరంత సిద్ధమేనా.వేరే రాష్ట్రాల్లో ఉంటు మోసం చేయటానికి వచ్చి పోతున్న నాన్ రెడిడెంట్స్ ఆంధ్రస్ కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతుంది ఈ యుద్ధం ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడుకి ఒక సవాల్ 14 సంవత్సరాలు సీఎం గా పరిపాలించారు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా చంద్రబాబు పేరు చెబితే బడికి, కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకం ఉందా అని అడుగుతున్న కనీసం అవ్వాతాతలకైన మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందా చంద్రబాబు పేరు చెబితే మంచి చేశాడని, మంచి పథకం తీసుకువచ్చాడనుకోవటనికి ఒక్కటి కూడా గుర్తుకురాదు ప్రజల ఆరోగ్యం కనీసం ఒక్క మంచి పనైనా ఉందా బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఒక్క గ్రామంలోనై మీ పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా కనీసం బాగుపడిన స్కూల్స్, హాస్పీటల్స్ ఉన్నాయా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినా కూడా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే చంద్రబాబు మార్క్ ఉందా బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం గుర్తుకువస్తుందా కేవలం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రాయటం, ప్రజలను మోసం చేయటమే ఆనవాయితీగా పెట్టుకున్నాడు చంద్రబాబు తెలుగు దేశం పార్టీ తరపున ఇచ్చిన మేనిఫేస్టోలో కనీసం 10 శాతమైన అమలు చేశారా మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలతో వస్తున్నారు, పులి మాదిగా 6 స్కీంలతో ఎర చూపిస్తున్నాడు, చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేప్పుడు భావదారిద్రమేందుకనేది బాబు నైజం నమ్మనవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకోగలుగుతాడని బాబు సిద్ధంతం మూడు సార్టు రంగుల మేనిఫేస్టోని తీసుకువచ్చాడు, కానీ చివరికి మేసం చేశాడు, ఏనాడు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చలేదు బాబు వంచన భరించలేకే కదా, ఐదేళ్ల క్రితం ప్రజలంతా, చొక్క మడతేసి బాబుకు ఉన్న కూర్చీని మడిచి, వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కి తగ్గించారు, మరోసారి చోక్క మడతపెట్టేందుకు సిద్ధామా 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకువచ్చేది వెన్నుపోట్లు, మోసాలు ఈ పెద్దమనిషి చేయలని పనులన్ని ఈ 57 నెలల పాలనలోనే చేసి జగన్ మార్క్ ప్రభుత్వాన్ని ఇవ్వాగలిగాం ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్ధి మనుసులో చోటు సంపాదించుకోగలిగాం ఈ 57 నెలల్లో మన ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఒక్కరు చెప్పాలి, మన ప్రభుత్వంలోని పథకాలు తీసుకున్న లబ్ధిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాలి మొదటి సారి ఛాన్స్ ఇస్తేనే రైతన్నకు రైతు భరోసాని ఇచ్చాం, పగటి పూటే విద్యుత్ అందుబాటులోకి తీసుకువచ్చాం, స్టార్ క్యాంపెయినర్లుగా రైతన్నలు వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి, గతంలో చంద్రబాబు బేషరతుగా చేస్తాన్న రూ. 87వేల కోట్ల రుణమాఫిని చేయకుండా మోసం చేశాడు అక్కచెల్లమ్మలకు ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఈ పథకాల లబ్ధిదారులనై అక్కచెల్లమ్మలందరు ప్రతి ఇంటికి వెళ్లి మీ జగనన్న ప్రభుత్వంతో జరిగిన మంచి చెప్పాల్సిన అవసరం ప్రతి వాలంటీరుకు ప్రతి అక్కచెల్లమ్మకు ఉంది. అక్కచెల్లమ్మలకు ఒకటే చెప్పండి…

ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసి సింక్లోనే ఉండాలి…

మన పిల్లలకు మొట్టమొదటి సారి ఇంగ్లీషు మీడియం ఇచ్చాం, డిజిటల్ క్లాసులు, ఐబీ, అంతర్జాతీయ వేదికల పై మన పిల్లలను నిలబెట్టాం. ప్రతి ఇంటికి వెళ్లి నప్పుడు అడగండి, ఇవన్ని కొనసాగాలి అంటే మళ్లి జగనన్న ముఖ్యమంత్రీ అయితేనే జరుగుతుందని చెప్పండి, ఫ్యాన్ గుర్తుకు ఒటు వేయటమంటే, మన పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే సైకిల్ గుర్తుకు ఒటు వేయటమంటే, మన పిల్లలు చదివే ఇంగ్లీషు మీడియంన రద్దు చేయటమే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి, ఈ రోజు మన వైయస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వతాతలకు, అక్కచెల్లమ్మలకు రూ. 3000 పింఛన్ ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపిస్తున్నం.. ఇలా మీఇంటికి పింఛన్ రావాలన్న, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్న ఫ్యాన్ గుర్తుకు ఒటు వేస్తేనే జరుగుతుందని ఇంటిఇంటికి చెప్పండి, స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి వికలాంగుడు, ప్రతి అవ్వతాత బయటికివచ్చి కనీసం 100 మందికైన చెప్పండి పేదలు వైద్యంకోసం రాకూడదన్న, గడపగడపకు వైద్యం చేరాలన్న, ప్రతి కుటుంబానికి మంచి జరగాలన్న మనందరి ప్రభుత్వానికి నిలబడాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి,మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏ గ్రామంలోకి వెళ్లి చూసిన ఒక విలేజ్ సెకరెటరీ, డిజిటల్ లైబ్రరి, హస్పీటల్స్, రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. లంచం, వివక్ష లేకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి ఐదు ఏళ్ల కిందట లంచం లేకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తాయని ఊహించారా అని అడగండి, మీ బిడ్డ 125సార్లు బటన్ నోక్కి ప్రతి లంచంలేకుండా నేరుగా మీ ఖాతాలో వేశారా అని అడగండి. ప్రజలు మొదటిసారి ఆశిర్వదిస్తే ఇంత మంచి చేయగలిగాం, రెండువసారి మూడవసారి ఆశర్వదిస్తే ఇంకేంత మంచి జరుగుతుందో ఆలోచించండి
నా నిరుపేద వర్గాలంటు గుండెల నిండ అప్యాయతతో రూ.2.55లక్షల్లో 75శాతం ఇచ్చాడని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. జగనన్న మార్కు గవర్నేన్స్ గురించి చెప్పండి తరతరాలుగా మారని బతుకులు మారాలని, ఈ వర్గాలన్ని కదిలిరావాలని, స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి, బాబుకు ఒటు వేయటమంటే సామాజిక వ్యతిరేక న్యాయానికి ఒటు వేయటమే అని చెప్పండి మేనిఫేస్టోలో ఇచ్చిన హామిల్లో 99శాతం నేరవేర్చి ఎన్నికలకు దిగబోతున్న ఏకైక పార్టీ మీ వైయస్ఆర్సీపీ ఇవన్ని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని అడగండి అయ్యా చంద్రబాబు, జగన్ మార్కు ప్రతి ఇంట్లోను, ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నప్పుడు మీకెందుకు ఒటు వేయాలి అయ్యా బాబు, జగన్ తన పాలనలో ప్రజలకు చంద్రబాబు నిజంగా నమ్మితే పొత్తులు ఎందుకు జగన్ కు ప్రజా బలం లేకపోతే ఇన్ని పోత్తులు ఎందుకు బాబు సైకిల్ తోయటానికి ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి ప్రతి పేదవాడు తన గుండెల్లో జగనన్న పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయి,ఈ 57 నెలల్లో ఏకంగా 125 బటన్లు నోక్కాను ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మద్ధతుగా, వారి మంచి భవిష్యత్తుకు ప్రజలు రెండు బటన్లు నోక్కాలని ప్రతి ఇంటికి వెల్లి చెప్పండి ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడద ఉండదు, లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, లకలక అంటు ప్రతి ఇంటి వస్తుంది మీకు మంచి జరిగితేనే నాకు ఒటు వేయండని నిబద్ధతతో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి మరోవంక బాబు పేదలకు ఏం చేశాడో చెప్పుకోని పరిస్థితిలో సంసిద్ధం అంటు పోస్టర్లు వేస్తుంటారు ఎందుకు సంసిద్ధం ఎవరితో యుద్ధం బాబు పేదలకోసం సిద్ధం మనం యుద్దం చేస్తున్నాం వారు పెత్తందారుల తరుపున సంసిద్ధం అంటున్నారు దుష్టచతష్ట బాణాలకు ఇక్కడ ఉన్నది ఇక్కడ అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అర్జునుడికి తోడో కృష్టుడి రూపంలో మీరు ప్రజలే అండగా, ప్రజలతోనే పోత్తుగా పోరటానికి మీ బడ్డి సిద్ధం మీరంత సిద్ధమా మన పార్టీ కార్యకర్తలకు, వాలంటీర్లకు, వార్టు మెంబర్లకు, మున్సిపల్ కౌనిలర్లకు ఒకటే చెబుతాను.ఇది మనందరి పార్టీ గత టీడీపీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ ఉంటే, ఆ స్థానంలో మన ప్రభుత్వం ఇంటిఇంటికి వెళ్లి పని చేస్తున్నవారిని స్టార్ క్యాంపెయినర్లుగా మర్చింది మన పార్టీ అభిమానించే వారికి చరిత్రలు ఎవరు ఇవ్వని విధంగా పదవులు ఇచ్చాం జగన్ను నమ్మిన వారికి అంచెలంచెలుగా ఆవకాశాలు ఇచ్చిన పార్టీ వైసీపీ పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఒకటి చెప్పాలనుకుంటున్న
మీ జగన్ మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు ఈ 57 నెలల మన పరిపాలన చూశారు, గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు, ఎలాంటి నాయకుడు మీకు కావాలి చంద్రబాబులాగా రంగురంగుల మేనిఫేస్టో చూపించి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్కచెల్లమ్నలను ఏలా మేసం చేయాలి, దిక్కుమాలిన ఆలోచనలతో మేనిఫోస్టోన రూపించి, అధికారంకి వచ్చాక మేనిఫేస్టో చెత్తబుట్టల పడేసిన చంద్రబాబు కావాలా నాయకుడంటే ఒక మాట నోటిలోంచి వచ్చాక, కష్టమైన నష్టమైన మాట మీద నిలబడేవాడే నాయకుడు ఈరోజు మేనిఫేస్టోలో ఇచ్చిన మాట నేరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికి వెళ్లగలుగుతున్నాం, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసి మా నాయకుడు మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని చెప్పాలి, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు అండగా నిలిచాం
మాట ఇచ్చాం, నేరవేర్చాం అందుకే వచ్చే ఎన్నికల్లో 175/175 25/25 ఎంపీలు గెలవాలని అడుగుతున్న పరిపాలనలో మనం తగ్గలేదు, కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ సిట్ల గెలుపులో కూడా తగ్గకూడదు అటు టీడీపీ ఇటు వైసీపీ అటు పెత్తందారులు ఇటు పేదవాడు పేదవారి భవిష్యత్తు కోసం అడుగుతున్న యుద్దానికి మీరంత సిద్ధమేనా మరో రెండు నెలల్లో ఎన్నికలు మరి కోన్ని రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి మీరంత సిద్ధమేనా
చంద్రబాబు మేసపూరిత ప్రకటనల నుంచి పేదవారి భవిష్యత్తు కాపాడేందుకు మీరంత సిద్ధమేనా వారి మీడియా, వారి సోషల్ మీడియా దుష్పప్రచారాలను తిప్పి కొట్టెందుకు మీరు సిద్ధమేనా మీ పాత్రే అత్యంత కీలకం, సమరభేరి మోగిద్దం మరో గొప్ప చారిత్రత్మక విజయానికి మీరంత సిద్ధమేనా అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి వెళ్లిపోతుంది, ఇక టీడీపీ రూపురేఖలు కూడా కనిపించవు, అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకం, అందుకే పెత్తందారు ఏకమవుతున్నారు మన యుద్ధం చంద్రబాబుతో మాత్రమే కాదు, ఒక్క పచ్చమీడయాతో యుద్ధం చేస్తున్నాం, వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం,జాతియపార్టీనికుడా వారితో తెచ్చుకుంటున్నారు అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం మీ జగన్ కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి మీ జగన్ ప్రతి అక్కచెల్లమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి రైతన్న జగనన్నకి తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాలి ఈ ఎన్నికల పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించేవే అని తెలుపుతున్న పేదవాడి భవిష్యత్తు మారాలన్ని, పేదవాడి పిల్లలు పెత్తందారులతో పోటీ పడాలంటే పెత్తందారుల పార్టీని నాశనం చేసే పరిస్థితిరావాలి అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి మంచి చేస్తున్న ప్రభుత్వ కలకాలం ఉండాలని, మరోఆవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు,