Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చిన్న మేడారం టెండర్లన్నీ రద్దు చేయాలి

  • మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న భక్తులు

రాజాపేట,ఫిబ్రవరి18( నిజంచెపుతాం) రాజపేట మండలం చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నిర్వాహకులు చేపట్టిన టెండర్లన్నీ రద్దు చేయాలని భక్తులకు ఆర్థిక భారం లేకుండా వనదేవతల దర్శనం కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు.ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ దర్శనాల టికెట్లతో పాటు ఇతర టికెట్లను కూడా లేకుండా సంబంధిత టెండర్లన్నీ వెంటనే రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించాలని ఈ విషయంపై కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీ ఓ నివేదికను వెంటనే అమలు చేయాలని కోరారు.కనీస వసతులు లేకుండా కేవలం భక్తుల ఆర్థిక నిలువు దోపిడీ కోసమే జాతర నిర్వహిస్తున్నట్లుగా వ్యాపారపు కేంద్రంగానే నిర్వాహకులు చూడడం సబబు కాదని కోరారు.నిర్వాహకుల నిర్వాకంపై అసంతృప్తితో ఉన్న భక్తులు సంబంధిత అధికారుల పట్ల ఆరోపణలు చేస్తున్నారు.విద్యుత్ చార్యం జరగకుండా విద్యుత్ శాఖకు ఆర్థికంగా నష్టం జరగకుండా అదేవిధంగా ప్రభుత్వ ఇతర శాఖలకు నష్టం జరగకుండా,మద్యం విక్రయించకుండా స్పందించాలన్నారు.