Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కురవిలో అక్రమ మట్టి తరలింపు… పట్టించుకోని అధికారులు

  • బూడిద చెరువులో జేసిబితో తోవ్వకాలు.
  • చెరువులో ప్రమాధాకరంగా మారుతున్న గుంతలు రాత్రి,పగలు అతివేగంగా ట్రాక్టర్ల తరలింపు.
  • ప్రణాభయంతో జంకుతున్న గ్రామ ప్రజలు.
  • ట్రాక్టర్ల యాజమానుల ఇష్టా రాజ్యంగా మారిన వైనం.
  • అమ్యామ్యలకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు.

కురవి, నిజం చెపుతాం, ఫిబ్రవరి 18: మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బూడిద చెరువు నుంచి జేసీపీ యంత్రం సహాయంతో అక్రమ మట్టి తరలింపు యదేచ్ఛగా సాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తరలింపు దందా “మూడు పువ్వులు ఆరు కాయలు”అన్న చందంగా సాగుతుంది. చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీల ద్వారా మట్టి తవ్వకాలు చేసి వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అడిగే వారులేక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మట్టి తరలించి లక్షలల్లో సొమ్ము చేసుకుంటున్నారు.ఒక్క ట్రిప్ కు రూ.700 చొప్పున మట్టిని అమ్ముకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అంతే కాదు ట్రాక్టర్ల కు నెంబర్ ప్లేట్లు ఉండవు, డ్రైవర్లకు లైసెన్స్ ఉండదు. ప్రమాదం జరుగుతే ఇక అంతే..? చెరువు నుంచి అతివేగంగా మట్టి తరలిస్తున్నారు. జేసీపీతో చెరువులో పెద్ద పెద్ద గుంతలు తోవ్వడం వల్ల ప్రమాధకరంగా మారుతుంది. చెరువు నుంచి మట్టి తరలింపు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తూ కొందరు అక్రమార్కులు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు :

కురవి బూడిద చెరువు నుంచి ఆదివారం ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. చెరువు నుంచి ట్రాక్టర్ల ద్వారా అతివేగంగా రాత్రి,పగలు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు అధికారులకు పిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అంటే ఆంతర్యం ఏమిటని ప్రజల్లో పలు అనుమానం మొదలైంది. ప్రత్యేక అధికారుల పాలన మొదలు కావడంతోనే అక్రమ మట్టి తరలింపునకు తెరలేపినట్లైందన్నారు.మట్టి తరలింపుతో చెరువులోపల ప్రమాదకర గుంతలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామం నుంచి మట్టి తరలింపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.అక్రమ మట్టి తరలింపుపై సంబంధిత కురవి రెవిన్యూ తహసీల్దార్ సునీల్ రెడ్డికి సెల్ ఫోన్ ద్వారా సమాచారం తెలిపిన స్పందన లేదని,స్థానిక పోలీస్ సిబ్బంది మట్టి తరలిస్తున్న స్థలానికి వెళ్లి మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారిచ్చే కాసులకు ఆశపడి తిరిగి రావడం జరుగుతుందని స్థానిక గ్రామస్తులు బహుమాఠంగానే చర్చించుకుంటున్నారు.ఇప్పటికై నా సంబంధిత అధికారులు అక్రమంగా తరలించిన మట్టిని స్వాధీనం చేసుకోవాలని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.