Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం వేగవంతం గా చేపట్టాలి *గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

(ములుగు ) ఓటరు నమోదు కార్యక్రమం వేగవంతం గా చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్- ఖమ్మం – నల్గొండ నియోజక వర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో కొంత అయోమయం జరిగింది. గతంలో ఓటర్లుగా ఉన్నవారి నమోదు సరిగా జరగలేదన్నారు.
ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ వల్ల కూడా కొంత ఇబ్బంది అయ్యింది. అయితే వీటన్నిటినీ అధిగమించి మన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఒక్క ఓటర్‌ను నమోదు చేయకున్నా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. మన అభ్యర్థి గెలుపు పై సందేహం లేదు. అయితే ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్పే విధంగా ఈ ఫలితాలు ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆలోచన అని వివరించారు. ఈరోజు ఈ ములుగు బ్రహ్మడంగా అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం సీఎం కేసిఆర్ అని పేర్కొన్నారు.కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ చైర్మన్ నాగ జ్యోతి, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యులు గోవింద్ నాయక్, హరిబాబు, భవాని, శ్రీదేవి, శ్రీనివాస్ రెడ్డి, పల్లా బుచ్చయ్య, రజిత, వాణిశ్రీ, చంద్రయ్య, రామాచారి, రుద్రమదేవి, భిక్షపతి, సమ్మయ్య, సునిల్ కుమార్, రమేష్, శ్రీధర్ ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.