Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మధిర నియోజకవర్గంలో అభివృద్ధికి భట్టి విక్రమార్క తొలి అడుగు

  • అంతర్గత రహదారుల నిర్మాణానికి 334 కోట్లు మంజూరు
  • త్వరలోనే రూ 100 కోట్లతో మధిరలో ఇంటిగ్రేటెడ్ గురుకుల కళాశాల నిర్మాణానికి భూమి పూజ
  • మధిర పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు?
  • రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధికి ప్రణాళికలు

TS; మధిర నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో అగ్రభాగాల నిలిపేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేని పరిస్థితుల నుండి 2009లో నియోజకవర్గాల పునర్విభజన తో మధిర శాసనసభ్యునిగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత మారుమూల ప్రాంతంగా ఉన్న మధిరకు సుమారు రూ.1800 కోట్లతో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత భట్టి విక్రమార్కదే అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని అది కేవలం భట్టి విక్రమార్కతోనే సాధ్యం అన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆయనపై ఉంచి గెలుపుకు కృషి చేసిన ప్రజల కు ఇచ్చిన మాట మేరకు తొలివిడతగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల లోపే 334 కోట్ల రూపాయలను గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేటాయించడం మధిర అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఆర్థిక శాఖ మంత్రిగా కీలక భూమిక పోషిస్తున్న ఆయన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగంగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు రహదారుల విస్తరణాలు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల పై ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన 15 ఏళ్లుగా శాసనసభ్యునిగా కొనసాగుతున్న ఆయన రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమగ్రమైన ఆలోచనల మేరకు అన్ని రంగాల్లో అన్ని నియోజకవర్గాలకు సముచిత అభివృద్ధికి నిధుల మంజూరు కు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకుల కళాశాల ఏర్పాటుకు అడుగులు వేసేందుకు సిద్ధమై0ది. ఈ క్రమంలో మధిర నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ కళాశాల ఏర్పాటుకు త్వరలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భూమి పూజ చేయనున్నట్లు సమాచారం.
మధిర పట్టణం పై ప్రత్యేక దృష్టి…..
మున్సిపాలిటీ గా ఉన్న నియోజకవర్గ కేంద్రంలో తన మార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టేందుకు భట్టి విక్రమార్క అడుగులు వేస్తున్నారు. అంతర్గత రహదారుల విస్తరణతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాశీ పవిత్రత కలిగిన మహిమాన్విత మహా మృత్యుంజయ స్వామి ఆలయ అభివృద్ధి వైరా నది పై మధిర మడుపల్లిని అనుసంధానిస్తూ బ్రిడ్జి నిర్మాణానికి కూడా త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గ నియోజకవర్గం గా అభివృద్ధి చేసేందుకు లక్ష్యాన్ని ఎంచుకున్న భట్టి విక్రమార్క ఆ దిశగా ప్రతి మండల కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కృషి చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే మండలాల వారిగా గ్రామాల వారీగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై నివేదికలను తెప్పించుకున్న ఆయన ఆ దిశగా అవసరమైన చర్యలకు నిధుల కేటాయింపుతో అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.

ఇందిరా డైరీ తో మహిళా సాధికారత ….
దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనల ఆశయాలలో ఒకటిగా ఉన్న మహిళ సాధికారత పై తొలి నుండి దృష్టి సారించిన భట్టి విక్రమార్క మధీర నియోజకవర్గంలో ఇందిరమ్మ డైరీ నీ ఏర్పాటు చేయడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కు 2012-13 లోనే బీజం వేశారు. అనివార్య కారణాలు మారిన రాజకీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మరుగున పడిన ఇందిరమ్మ డైరీ తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే జీవం పోసుకుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ప్రత్యేక అధికార యంత్రాంగంకు బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.