Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సాయుధ నక్సలైట్ల అరెస్టు చూపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్

భద్రాద్రి కొత్తగూడెం,ఇల్లందు 17 (నిజం చెబుతాం) ఇల్లందు మండలం, పూసపల్లి గ్రామ అటవీ ప్రాంతం లో ఎన్ డి పార్టీకి చెందిన సాయుధులైన నక్సలైట్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో పోలీసు లు ఆ ప్రాంతంలో సోదా చేస్తుండగా కొందరు సాయుధులైన నక్సలైట్లు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వారి వెంటపడగా 5గురు నక్సల్స్ పోలీస్ వారికి దొరికినారనీ జిల్లా ఎస్పీ రోహిత్ తెలిపారు. దొరికిన వారిలో
కురసం వంజయ్య @ అశోక్, స్టేట్ కమిటీ సెక్రెటరీ, సిపిఐ (ఎంఎల్) ఎన్డి (పెద్ద చంద్రన్న వర్గం) s/o పెద్ద ముత్తయ్య, 55సం. కోయ, r/o రామగుండాల గ్రామం, బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లా. (సాయుధ దళం I/c),దనసరి సమ్మయ్య @ గోపి @ గోపన్న, (సిపిఐ (ఎంఎల్) ఎన్ డి రాష్ట్ర కమిటీ మెంబర్) S/O లచ్చయ్య, 55 సం, కోయ, r/o ఎంచన్ గూడెం గ్రామం, కొత్తగూడ మండలం, మహబూబాబాద్ జిల్లా, (సాయుధ దళ సెక్రటరీ), సనగే పొంగుల ముత్తయ్య @ పుల్లన్న@ మనోజ్ s/o లక్ష్మయ్య, r/o ఈసలాపురం, మిర్యాలపెంట గ్రామం, బయ్యారం మండలం , మహబూబాబాద్ జిల్లా, (సాయుధ దళ కమాండర్). షేక్ మదర్ సాహెబ్ S/O నసీర్ 54 సం, దూదేకుల, r/o ముస్తఫా నగర్ స్ట్రీట్, బయ్యారం మండలం. మహబూబాబాద్ జిల్లా (సాయుధ దళ కొరియర్),కలకొండ సురేష్ s/o వీరయ్య, 50స కుసుమంచి మండలం ఖమ్మం జిల్లా, వీరి దగ్గర ఒక పిస్టల్, 16 రౌండ్ల బుల్లెట్లు,5 జిలెటిన్ స్టిక్కులు, 10 డిటోనేటర్లు, 4 కిట్టు బ్యాగులు విప్లవ సాహిత్యంతో పట్టుపడ్డారని ఎస్పీ రోహిత్ తెలిపారు. 2023 సెప్టెంబర్ నెలలో ప్రభుత్వంపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకొని ఒక సాయుధలం ఏర్పాటు చేసుకుని గ్రామ గ్రామాన ఎండి పార్టీ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు వీరితోపాటు మరో 6 గురు పారిపోయారని వారిని వదిలేది లేదని తెలిపారు పారిపోయిన వారు ఆయుధాలతో సహా లొంగిపోవాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అనుగుణంగా జనజీవన లో కలవాలని తెలిపారు.