Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచింది మోదీ

  • సంకీర్ణ రాజకీయాలకు తావివ్వకుండా పదేళ్ల కాలం పాటు అజేయమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న భారత ప్రజలు
  •  దేశ ప్రతిష్ట, దేశ గౌరవం, దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని ఒకే ఒక హామీ ఇచ్చిన మోదీ
  •  చేవెళ్లలోని బీజేపీ చేరికల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్
    చేవెళ్ల, ఫిబ్రవరి 15 (నిజం న్యూస్) :
    అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచింది గొప్ప నాయకులు మోదీనని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ లో నిర్వహించిన బీజేపీ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీలో చేరే నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి కేజీఆర్ గార్డెన్ లోని కార్యక్రమ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం బీజేపీ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ, నాయకులు రమణారెడ్డి, వైభవ్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ విఠలయ్య, దేవుని ఎర్రవల్లి మాజీ సర్పంచ్ సామ మాణిక్ రెడ్డి, ధర్మసాగర్ రామ్ రెడ్డి, కౌకుంట్ల నాగార్జున రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అమరేందర్, వెంకటేష్, యాదయ్య మరియు చేవెళ్ల, దేవుని ఎర్రవల్లి, ఊరెళ్ళ, కౌకుంట్ల తదితర గ్రామాల లోని వివిధ పార్టీల చెందిన కార్యకర్తలకు బీజేపీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు అన్ని సంస్కృతుల, భాషల, ప్రాంతాల అశేషమైన ప్రజాదరణ పొందిన గొప్ప నాయకులు మోదీ అని అన్నారు. పన్నెండు సంవత్సరాల కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చ లేకుండా, ఎక్కడ స్కామ్ లేకుండా గొప్ప పరిపాలన అందించారని పేర్కొన్నారు. గుజరాత్ ను అభివృద్ధి చేశారని, గుజరాత్ మోడల్ గా దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తానన్నరని తెలిపారు. వారు దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని, సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో, దేశ ప్రజానీకం విసిగి వేజారిన సందర్భంలో సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లిపోవాలని, ప్రభుత్వమంటూ ఉంటే పటిష్టంగా ఉండాలని, ఎక్కడ కూడా సంకీర్ణ రాజకీయాలకు తావివ్వకుండా, ఈ నిర్ణయం తీసుకున్నా‌, ఏది అమలు జరిగినా, ఇష్టంగా ఉండాలని చెప్పి సంపూర్ణమైన మెజారిటీతో 273 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, మిగతా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు ఇచ్చి ఒక అజేయమైన ప్రభుత్వాన్ని భారత ప్రజలు 2014లో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆనాటి నుంచి ఐదు సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ లాగానో, బీఆర్ఎస్ పార్టీ లాగానో అమలు కాని హామీలు నరేంద్ర మోదీ ఇవ్వలేదని అన్నారు. మహిళా పథకాలు, యూత్ పాలసీలు, రైతు పాలసీలు, ఇలాంటి పథకాలు ఎక్కడ ప్రకటించకుండా ఐదు సంవత్సరాలు దేశానికి ఒక సేవకుడిలాగా పరిపాలన అందించారన్నారు. దేశ ప్రతిష్ట దేశ గౌరవం ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని ఒకే ఒక హామీ మోదీ ఇచ్చారని తెలిపారు. అంతే కాదు ప్రజలు మెచ్చే నచ్చే పద్ధతిలో తన ప్రవర్తన ఉంటుందని, తనకు కొడుకు, కూతుర్లు లేరని నా కుటుంబమే 140 కోట్ల ప్రజలని, గర్వంగా ప్రకటించి ఆనాడు మళ్లీ దేశ ప్రజలను కోరుతూ ఎన్నికలకు వెళ్లారన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో మోదీపై ఎలాంటి వ్యతిరేకత, విమర్శలు లేకుండా పాలన అందించిన మోదీకి రెండవసారి మరింత సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి 303 సీట్లిచ్చి, అదేవిధంగా మిత్ర ప్రక్షాలకు కూడా కొన్ని సీట్లు ఇచ్చి మరోసారి అజేయమైన శక్తిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా, గొప్ప గొప్ప దేశాలు యూరప్ అని పేరుండేది, అంతేకాదు ఆ ప్రెసిడెంట్ ల గురించి ప్రధాన మంత్రుల గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇవాళ ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకులు ఎవరంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. దానికి మోడీ ఆచరణ, కార్యదీక్ష ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చున్నన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే ఆ దేశంలోని విమానాశ్రయంలో బూట్లు విడిపించి ఆయనను చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ ఇవాళ అదే మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు పోయిన లండన్ పోయిన రెడ్ కార్పెట్ వేసి మోడీకి స్వాగతం పలికే పరిస్థితికి వచ్చామన్నారు. చైనా ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు చేతిలో చేయ్యి వేసి, భుజం మీద చేయ్యి వేసి చెప్పగలిగే స్థాయికి సమానంగా భారత ప్రజల ఆత్మ గౌరవం మోదీ నిలబెట్టారన్నారు. కరోనా వచ్చిన తర్వాత కష్టాలతో సంబంధం లేకుండా 80 కోట్ల మందికి, ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చి అన్నం పెట్టిన గొప్ప నాయకులు మోదీ అని అన్నారు. ఒక కోటి 30 లక్షల మందికి రూపాయి తో సంబంధం లేకుండా జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి అనేక పథకాలు అందిస్తున్నారన్నారు. పేదలకు గ్యాస్ సిలిండర్లు అందించే విషయం కావచ్చు, పేద రైతాంగానికి పెట్టుబడి సహాయంగా సంవత్సరానికి ఎకరానికి రూ.6000 వేలు అందిస్తున్న గొప్ప నాయకులు మోదీనని అన్నారు. కరోనాతో కంటిమీద కునుకు లేకుండా వణికిపోతున్న ప్రజలకు ధైర్యమే మందు అని, అంతేకాక కరోనాకు వ్యాక్సిన్ రావాలని, ప్రజలు కరోనాతో భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ఆ వ్యాక్సిన్ ను పేద ప్రజానీకానికి ఉచితంగా అందించిన గొప్ప నాయకుడు మోదీయనని పేర్కొన్నారు. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎరిమేట్స్) అన్ని మతాలను మెప్పించి, అలాంటి దేశాలలో మొట్టమొదటిసారి గొప్ప ఆలయాన్ని మోదీ నిర్మింపజేశారన్నారు. అన్ని మతాలను ఒప్పించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి భారత ప్రజానీకానికి అంకితమిచ్చారన్నారు. భారతదేశ సుభిక్షంగా ఉందని శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లకు ఆపద సమయాలలో ఆదుకున్నది మన భారతదేశమేనని, అంతే కాదు పక్కనే ఉన్న పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధాలు వస్తే మేము కూడా భారత దేశంలో కలుస్తామని అంటున్నారంటే అది మోదీ ఘనతయేనని అన్నారు. పిఓకే ( పాకిస్తాన్ అక్యూపైడ్ కాశ్మీర్) కూడా ఇవాళ భారతదేశంలో ఉంటామనే పరిస్థితికి వచ్చిందన్నారు. వాళ్ల మోదీ నినాదం 400 సీట్లీచ్చి మరోసారి ప్రధానిగా ఆశీర్వదించమంటున్నారన్నారు. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయన్నారు. 17 సీట్లలో ఒకటి చేవెళ్ల పార్లమెంటు స్థానమని ఆ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్ధాంతం లేని వ్యక్తి, సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా దివాలా తీస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధాంతాలు లేని పార్టీలని అవి దివాలా తీయడం ఖాయమన్నారు. సిద్ధాంతాలు గల పార్టీ, జాతీయ వాదంతో ముందుకెళ్తున్న పార్టీ కేవలం బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశం బాగు కావాలంటే, రాష్ట్రాలు బాగు కావాలి, రాష్ట్రాలు బాగు కావాలంటే గ్రామీణ ప్రాంతాలు కూడా బాగు కావాలని ముందుకెళ్తున్న పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. చరిత్రలో ఎవరు, ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుజరాత్ లో 30 ఏళ్లు సీఎంగా ఉన్న గొప్ప నాయకుడు మోదీయేనని అన్నారు. ముఖ్యమంత్రి అడిగితే తొమ్మిది వేల కోట్లు మోదీ అప్పు ఇచ్చారన్నారు. ఉచిత బియ్యం మద్దతు ధర, వ్యవసాయానికి పథకాలు, ఇలా అనేక పథకాలు మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇలాంటి దేశ ప్రజాధారణ పొందిన ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేరు వేరు దేశాలకు ప్రధాని మోదీ వెళితే తన కాళ్లకు నమస్కరిస్తున్నారన్నారు. కరోనా విపత్కర కాలంలో పేద దేశాలను ఆదుకున్న గొప్ప నాయకుడు మోదీనేనన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన ఘనత మోదీదేన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ నాయకులు నరేష్, ప్రతాప్ రెడ్డి, పాండురంగారెడ్డి, అత్తిల్లి అనంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్ నరేందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి వెంకట్ రెడ్డి సురేష్ యాదవ్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.